Sugar Intake Per Day : ఉదయం లేచిన దగ్గర్నుంచి టీ, కాఫీ, పాలు, లస్సీ, జూస్, ఇలా ప్రతి దాంట్లో పంచదార కలుపుకొని తాగడం అలవాటు అయిపోయింది. కానీ పంచదార వల్ల శరీరంలో ఎన్నో క్యాలరీలు చేరతాయి. పంచదార ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పంచదార వల్ల లాభాలు ఒక్కటి కూడా లేకపోగా నష్టాలు మాత్రం లెక్కలేనన్ని ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరి ఒక రోజుకి మనం ఎంత పంచదార తీసుకుంటే మంచిది అంటే దానికి జవాబు 30 గ్రాములు. అవును రోజుకి 30 గ్రాముల కంటే ఎక్కువ పంచదార తింటే లేనిపోని ఆరోగ్య  సమస్యలు వచ్చి పడతాయి. అయితే మనం తినే మిగతా ఆహారాలలో కూడా చక్కర శాతం ఎంతో కొంత ఉంటుంది. దానిని కలుపుకునే ప్రతిరోజు 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర శరీరంలోకి వెళ్ళకూడదు. 


పంచదార ఎక్కువగా తినడం వల్ల ప్రమాదకరమైన టైపు 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన వారు తాము తీసుకునే చక్కర శాతాన్ని చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది. అదే వారి ఆరోగ్యానికి మంచిది. 


చక్కెర ఎక్కువగా తింటే దంతాలు త్వరగా క్షీణిస్తాయి. అధిక రక్తపోటు, ట్రై గ్లిజరైడ్స్, శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు కూడా దీని వల్లే వస్తాయి. అంతే కాకుండా గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. పంచదార కలిపిన పానీయాలు, పదార్థాలు రుచిగా ఉంటాయి కానీ అవి మన శరీరానికి చేసే హాని ఇంకా ఎక్కువగా ఉంటుంది. 


ఇక ఎక్కువ తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల మహా అయితే డయాబెటిస్ మాత్రమే వస్తుంది అని కొందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎక్కువ తీయటి పదార్థాలు తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ ఇబ్బందులు కూడా పెరుగుతాయి. దానివల్ల మలబద్ధకం కూడా ఏర్పడుతుంది. 


తీపి ఎక్కువగా తినటం వల్ల మన శరీరంలో ఏర్పడే హార్మోన్స్ కూడా దెబ్బతింటాయి. దానివల్ల చిరాకు కోపం వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మూడ్స్ స్వింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఈ విషయం మీద కూడా ఏకాగ్రత కుదరదు. మన చర్మం కూడా బాగా పొడిబారిపోయి జీవం లేనట్టు అయిపోతుంది. చర్మం పై ముడతలు, గీతలు చిన్న వయసు ఉన్నవారికి కూడా వచ్చేస్తాయి. 


చక్కెర లో ఎలాంటి పోషకాలు ఉండవు. అందుకే అసలు పంచదార తినాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత పంచదార ను తగ్గించేయడం మంచిది. ఒకవేళ తీయటి పదార్థాలు తినాలి అనిపించినా, స్వీట్ తినాలి అనిపించినా, పంచదారకి బదులు బెల్లంతో చేయడం మంచిది. చక్కెర బదులు మనం పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు వంటివి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.  అలాగే రోజు ఒక స్పూన్ తేనెను తాగడం వల్ల చక్కెర తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది.


Also Read: Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్‌ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?


Also Read: Revanth Is Lilliput: 'రేవంత్‌ రెడ్డి ఒక లిల్లీపుట్‌': కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter