Control Cholesterol Level: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఇవే.. వీటికి దూరంగా ఉండండి..!
Control Cholesterol Level: కొలెస్ట్రాల్ అనేది కణ గోడలు, నాడీ వ్యవస్థలను రక్షించే ఒక రకమైన పొర. ఇది హార్మోన్లను నిర్మించడానికి సహాయపడుతుంది.
Control Cholesterol Level: కొలెస్ట్రాల్ అనేది కణ గోడలు, నాడీ వ్యవస్థలను రక్షించే ఒక రకమైన పొర. ఇది హార్మోన్లను నిర్మించడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌లో ప్రోటిన్లు కలిస్తే కొవ్వు మరింత బలంగా మారే అవకాశాలున్నాయి. అయితే శరీర నిర్మాణంలో ఈ కొవ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ గుండెకు ప్రమాదకరం:
శరీరంలో మంచి, చెడు అనే 2 రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. దీనిని వరుసగా HDL, LDL అని కూడా పిలుస్తారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.. రక్త ప్రసరణకు అడ్డంకి మారుతుంది. వీటి కారణంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో LDL పెరగకుండా ఎలా ఆపాలో తెలుసుకుందాం.
వీటిని తీసుకోండి:
1. గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా దీనిని బరువు తగ్గించేందుకు కూడా వినియోగిస్తారు. అయితే క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగితే కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
2. ఫ్లాక్స్ సీడ్:
అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ విత్తనాల సహాయంతో శరీరంలోని పెరిగే చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదపులో ఉంచుతాయి.
3. చేపల్లో:
చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ, యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలోని రక్తంలో ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించి..రక్త ప్రవాహాన్ని క్రమబద్ధికరిస్తుంది. అంతేకాకుండా వీటిలో ఉండే పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు దోహదపడతాయి.
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వీటిని అస్సలు తినకూడదు:
1. ఆయిల్ ఫుడ్స్:
ప్రస్తుతం భారత్‌లో చాలా మంది చెడు నూనెలతో చేసిన స్ట్రీట్ ఫుడ్ తింటున్నారు. దీని వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరుగుతుంది.
2. పాల ఉత్పత్తులు:
భారత్‌లో పాలను సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. వీటిని అధిక కొవ్వు ఉన్న వారు అస్సలు తాగకూడదు.
3. మాంసం
మాంసం తినడం ద్వారా శరీరానికి చాలా రకాల ప్రోటీన్ లభిస్తాయి. కానీ దాని వినియోగం ఎక్కువ అవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని గణనీయంగా పెరుగుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Flour For Diabetes Patient: డయాబెటిక్ పేషెంట్స్ బయట లభించే పిండిని అస్సలు ఉపయోగించవద్దు..!
Also Read: Prostate Cancer Symptoms: పురుషులలో పెరుగుతున్న ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ సమస్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి