Flour For Diabetes Patient: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది డయాబెటిక్ పేషెంట్లుగా మారుతున్నారు. ఆహారం అలవాట్లలో మార్పలు రావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి మరింత పెరుగుతోంది. దీంతో శరీరంలో వివిధ రకాల మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి పిండిలో రుచిని పెంచడానికి చక్కెరను కలిపి విక్రయిస్తున్నారు. దీని వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ లేకుండా పోతుంది. అందుకే మార్కెట్‌లో లభించే ఇలాంటి పిండి తినడం వల్ల మధుమేహ సమస్యలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అయితే ఎలాంటి పిండిని తీసుకోవడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ ఉంటుందో తెలుసుకుందాం..
డయాబెటిక్ పేషెంట్ కోసం ఇంట్లోనే పిండిని ఇలా తయారు చేసుకోండి:
1. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇంట్లో తయారు చేసిన పిండిని మాత్రమే వాడాలి.
2. ఈ పిండిని రాజ్‌గీర్, చిక్‌పీల మిశ్రమం, రాగి మిశ్రమం, బార్లీ, మిల్లెట్ మొదలైన వాటితో చేసుకోవచ్చు.
4. వీటి సన్నగా గ్రైండ్ చేయాలి
3. ఈ పిండితో తయారుచేసిన తాజా రోటీలను తినండి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పిండి వల్ల కలిగే ప్రయోజనాలు:
1. ఈ పిండిని తృణధాన్యాలతో తయారు చేయడంతో పోషకాలు చాలా ఉంటాయి.
2. శరీరంలో ఫైబర్ స్థాయిని పెంచుతుంది.
3. ఈ పిండిలో ఉండే అనేక రకాల ధాన్యాల వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
4. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
5. ఈ పిండిలో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు ఉంటాయి.
6. శరీరంలో శక్తిని పెంచడానికి కృషి చేస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Benefits Of Watermelon: రెస్టారెంట్ స్టైల్‌లో పుచ్చకాయ జ్యూస్..తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు..!!
Also Read: Health Tips: పుచ్చకాయ తొక్క వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి