Copper Water Benefits: ప్రస్తుతం చాలామంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీటిని తాగేందుకు ఇష్టపడడం లేదు. వీటికి బదులుగా రాగి పాత్రల్లో రాగి బాటిల్స్ లోని నిల్వచేసిన నీటిని తాగుతున్నారు. మన పూర్వీకులు కూడా ఎక్కువగా రాగి పాత్రలో నిల్వచేసిన నీటిని మాత్రమే తాగేవారు. అందుకే వారు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఎంతో దూరంగా ఉన్నారు. అయితే రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల మనిషి శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాత్రల్లో నిలువ చేసిన ఆహారాలతో పాటు నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోకి వెళ్లే బ్యాక్టీరియా పరిమాణాలు తగ్గుతాయట. అంతేకాకుండా శరీరానికి మరెన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రయోజనాల వెనుకున్న నిజమెంతో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరానికి లాభాలు కలుగుతాయ?
ప్రస్తుతం చాలామంది వైద్యులు రోగులకు రాగి పాత్రలో నీటిని తీసుకోమని సూచిస్తున్నారు. అయితే ఇటీవలే పరిశోధనలు తేలింది ఏమిటంటే.. రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయట. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని పోషకాల స్థాయిని పెంచేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని వివిధ అవయవాలను తీవ్రవాదుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 


శరీరంలోని బ్యాక్టీరియా చేరడం కారణంగా ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి 48 గంటలకు పైగా రాగి పాత్రలో నిలువ చేసిన నీటిని తాగాల్సి ఉంటుంది. ఈ రాగి పాత్రలో నిల్వచేసిన నీటిలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని ఎంతటి బ్యాక్టీరియానైనా నాశనం చేసేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
 
జీర్ణక్రియను మెరుగుపరచుతుంది:
తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాగి పాత్రలో నిలువ చేసిన నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ నీటిలో  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. తరచుగా ఆహారం జీర్ణం కాకపోవడం, మలబద్ధకం, ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రాగి పాత్రల్లో విలువ చేసిన నీటిని తాగాల్సి ఉంటుంది. ఈ నీటిలో శరీరాన్ని నుంచి టాక్సిన్స్ ని తొలగించే ఎన్నో రకాల ఔషధ మూలకాలు లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల తీవ్రవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీటిలో ఉండే మూలకాలు శరీరంలోని ఆమ్లాలను సమతుల్యంగా చేసేందుకు కూడా సహాయపడతాయి.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి