Corona Symptoms: గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కొవిడ్ మహమ్మారి.. రోజుకే రంగు మార్చుకుంటూ వస్తుంది. డెల్టా, ఒమిక్రాన్ తర్వాత ఇప్పుడు XE వేరియంట్ రూపంలో అనేక దేశాలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పుడు కరోనా 4వ వేవ్ రాబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాల్లో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కొవిడ్ 4వ దశలో వైరస్ సోకిన వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిసింది. అవేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగుతున్న కరోనా కేసులు


కరోనా వైరస్ XE వేరియంట్.. గతంలో వచ్చిన వాటికంటే బలమైనదని.. ఎక్కువ వ్యాప్తి కలిగి ఉందని నిపుణులు అంటున్నారు. అయితే అది ప్రాణాంతకం కాదని చెబుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో భారతదేశంలో నివసించే ప్రజల్లో చాలా మందికి యాంటీబాడీలు ఉన్నాయని.. XE వేరియంట్ వల్ల వారికి ఎలాంటి ప్రమాదం లేదని వారు భరోసా ఇస్తున్నారు. అదే సమయంలో కరోనా వైరస్ పట్ల అజాగ్రత్త వహించకూడదని సూచిస్తున్నారు. 


కళ్లపై కరోనా వైరస్ ప్రభావం


కరోనా వైరస్ సాధారణ లక్షణాల్లో జ్వరం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు ఉన్నాయి. అయితే కొవిడ్ సోకిన వారిలో అన్ని లక్షణాలు కనిపించాల్సిన అవసరం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాటి లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. 


ఆంగ్లియా రస్కిన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల్లో కరోనా సోకిన వారిలో కంటి నొప్పి కలుగుతుందని తేలింది. కంటిలో దురద, కళ్లు పొడిబారడం కూడా కరోనా లక్షణాలకు సంబంధించినవేనని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలను విస్మరించకూడని వారు స్పష్టం చేశారు. 


కళ్లు ఎర్రగా మారడం..


కరోనా సాధారణ లక్షణాలకు సంబంధించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా సోకిన వారిలో కళ్లు ఎర్రగా లేదా గులాబీ రంగులో మారుతాయని తెలిపింది. కరోనా సోకిన వారి కన్నీళ్లలో కరోనా వైరస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు వెంటనే అప్రమత్తమవ్వాలి. 


కరోనా వైరస్ సాధారణ లక్షణాలు


ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. దగ్గు, అలసట, ఊపిరి తీసుకోవడంలో సమస్య, ముక్కు కారడం వంటివి కరోనా వైరస్ నాలుగు సాధారణ లక్షణాలు. జ్వరం, అలసట, గొంతు నొప్పి, శరీర నొప్పులు, రాత్రి చెమటలు వంటివి కరోనా ఇన్‌ఫెక్షన్‌కి సంకేతాలు కావచ్చు. ఇది కాకుండా గొంతు నొప్పి లక్షణం చాలా మందిలో కనిపిస్తుంది.  


Also Read: Summer Drinks: ఎండల కాలంలో ఈ ఆరోగ్యకరమైన నేచురల్ పానీయాలను ట్రై చేయండి!


Also Read: Pomegranate Diabetes: షుగర్ వ్యాధిగ్రస్తులు దానిమ్మ జ్యూస్ తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook