Summer Drinks: ఎండల కాలంలో ఈ ఆరోగ్యకరమైన నేచురల్ పానీయాలను ట్రై చేయండి!

Summer Drinks: ఎండల కారణంగా చాలా మంది ఇంట్లో నుంచి బయటకు రావడమే మానేశారు. అందులోనూ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నుంచి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి క్రమంలో అధికంగా పానీయాలను తాగుతుండాలి. అయితే మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ కాకుండా ఈ నేచురల్ పానీయాలను ట్రై చేస్తే ఆరోగ్యం మీచెంతనే ఉంటుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 07:14 PM IST
Summer Drinks: ఎండల కాలంలో ఈ ఆరోగ్యకరమైన నేచురల్ పానీయాలను ట్రై చేయండి!

Summer Drinks: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం తరచూ శీతల పానీయాలు తాగడం మేలు. అయితే మీరు ఎప్పుడైనా నేచురల్ కూలింగ్ డ్రింక్స్ ప్రయత్నించారా? కృత్రిమ పానీయాలతో పోలిస్తే కొబ్బరి నీళ్లు, చెరకు రసం, మజ్జిక వంటి వాటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. 

చెరకు రసం

చెరకు రసంలో పుదీనా, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని తాగడం వల్ల శరీరానికి తగిన నీరు శాతం లభించడంతో పాటు శరీరంలోని వేడిమి తగ్గుతుంది. 

కొబ్బరి నీరు

కొబ్బరి నీరు ఉదయం లేదా భోజనం తిన్న 2 గంటల తర్వాత తాగడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి నీరు మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

కోకుమ్ సిరప్

కోకుమ్ సిరప్ పుచ్చుకోవడం వల్ల మీ శరీరం చల్లగా మారడం సహా.. ఎసిడిటీ సమస్యను కూడా తగ్గిస్తుంది. మీరు బరువు తగ్గాలనుకున్నా కూడా ఈ పండ్ల రసాన్ని తీసుకోవచ్చు.

ఖాస్ షర్బత్

రక్త ప్రసరణను నియంత్రించడంతో పాటు శరీరానికి తక్షణ చల్లదనాన్ని అందించేందుకు ఖస్ సిరప్ తీసుకుంటారు. ఇది మీ శరీరాన్ని మరింత హైడ్రేట్ గా ఉంచుతుంది.

బెల్ సిరప్

అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. బేల్ సిరప్ మీకు తక్షణ రోగనిరోధక శక్తిని అందించడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువయ్యింది.\

(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)       

Also Read: Pomegranate Diabetes: షుగర్ వ్యాధిగ్రస్తులు దానిమ్మ జ్యూస్ తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Also Read: Henna for Hair: జుట్టుకు హెన్నా రాసుకునే వాళ్లు కచ్చితంగా ఈ నిజాలను తెలుసుకోవాలి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News