Corona New Variant: కరోనా మహమ్మారి అంతకంతకూ రూపం మార్చుకుని మరీ దాడి చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పటికే విలవిల్లాడించింది. ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్ని భయపెడుతోంది. డెల్టా వేరియంట్ కాస్తా డెల్టా ప్లస్ వేరియంట్‌గా మారి దాడి చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నుంచి తేరుకుంటున్న సమయంలో ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. ఇది అత్యంత ప్రమాదకరమనే హెచ్చరికలు వస్తున్నాయి.


ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO)తాజా అధ్యయనం ప్రకారం కొత్తగా వెలుగు చూసిన వేరియంట్ పేరు R.1.(Corona New Variant R.1)ఇప్పటి వరకూ తక్కువ మందికే వ్యాపించినా..చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుందంటున్నారు. వాస్తవానికి గత ఏడాది జపాన్‌లో ఇది వెలుగు చూసినా ఇటీవలి కాలంలో కొత్తగా మరోసారి కన్పిస్తోంది. ప్రస్తుతం పదివేలమందికి ఈ కొత్త వేరియంట్ సోకిందని సమాచారం. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్న ప్రకారం ఈ వేరియంట్ చాలా ప్రమాదకరమైంది. ఈ వేరియంట్ లక్షణాలు కరోనా వైరస్ కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఈ వేరియంట్‌పై ఇంకా పరిశోధన జరుగుతోంది. అందుకే వ్యాక్సిన్ వేయించుకోవడమే ఉత్తమమైన మార్గంగా నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల కరోనా వేరియంట్ల నుంచి రక్షించుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గంగా ఉంది.


Also read: Coronavirus New Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ జాడ ఇండియాలో ఉందా లేదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి