Coronavirus New Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ జాడ ఇండియాలో ఉందా లేదా

Coronavirus New Variant: కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతున్నందున కరోనా వైరస్ కొత్త వేరియంట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇన్సాకాగ్ నివేదిక ఏం చెబుతుందో పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 25, 2021, 09:44 AM IST
  • కరోనా వైరస్ కొత్త వేరియంట్లపై ఇన్సాకాగ్ నివేదిక
  • ఇండియాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ల జాడ లేదంటున్న ఇన్సాకాగ్ నివేదిక
  • కరోనా వైరస్ వేరియంట్లపై అధ్యయనం చేస్తున్న జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం
 Coronavirus New Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ జాడ ఇండియాలో ఉందా లేదా

Coronavirus New Variant: కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా సంక్రమణ స్థిరంగా కొనసాగుతున్నందున కరోనా వైరస్ కొత్త వేరియంట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇన్సాకాగ్ నివేదిక ఏం చెబుతుందో పరిశీలిద్దాం.

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఇండియాను విలవిల్లాడించింది. ఇప్పుడా విపత్కర పరిస్థితుల్నించి నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. మరోవైపు కరోనా సంక్రమణ కూడా పూర్తి స్థాయిలో తగ్గలేదు. ఇప్పటికీ రోజుకు 30-35 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమలో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌కు సంబంధించి ఇన్సాకాగ్ కీలక విషయాలు వెల్లడించింది. జినోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం కరోనా వైరస్ వేరియంట్లపై అధ్యయనం చేస్తోంది. 

ఇండియాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ల(Corona New Variants)ఉనికిపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని జినోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం ఇన్సాకాగ్ తెలిపింది. డెల్టా ఉపవేరియంట్లకు(Delta Variant) సంబంధించి అదనంగా సూచించాల్సిన జాగ్రత్తలు లేవని వెల్లడించింది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ ఇండియాలో ఆందోళనకరమైన వేరియంట్‌గా కొనసాగుతోంది. డెల్టా కారణంగానే దేశంలో సెకండ్ వేవ్ ఉధృతి కన్పించిందని..ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఈ వేరియంట్ ప్రబలంగానే సంక్రమిస్తోందని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. జూన్‌లో బయటపడిన ఏవై 1 వేరియంట్ నెమ్మదిగా, స్థిరంగా సంక్రమిస్తోందని ఇన్సాకాగ్ వివరించింది. డెల్టాలో ఉపరకమైన ఏవై 4 వేరియంట్ లక్షణాలు కూడా బి.1.617.2 వేరియం తరహాలో ఉన్నట్టు మహారాష్ట్రలో జరిగిన ప్రాథమిక అధ్యయనంలో తేలింది. కరోనా కొత్త రకం వేరియంట్ల జాడ ఇండియాలో కన్పించలేదని వెల్లడించింది.

Also read: Private Versity Act: ప్రైవేటు వర్శిటీ చట్ట సవరణ, పేదలకు ఇకపై 35 శాతం సీట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News