Treatment For Cold And Cough: వర్షాకాలం, చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యల తరచుగా ఇబ్బంది పెడుతాయి. దీని కారణంగా శరీరం అలసటగా, నీరసంగా ఉంటుంది. ఈ లక్షణాల వల్ల చురుకుగా పని చేయలేకపోతాం. అయితే ఆరోగ్యనిపుణులు సలహాతో పాటు కొన్ని ఇంటి చిట్కాలను పాటించిడం వల్ల ఈ దగ్గు, జలబు నుంచి ఉపశమనం పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుంటాయి. సాధారణంగా దగ్గు,జలుబు నివారణ కోసం  సిరప్ లు ఉపయోగిస్తాం.దీని వల్ల  కొంత కాలం వరకు ఉపశమనం పొందవచ్చు. కానీ ఈ చిట్కాలను పాటిస్తే వెంటనే ఉపశమనం పొందవచ్చు. అయితే కొన్ని రకాల పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.


తులసి ఆకులు:


తీవ్రమైన దగ్గు, జలుబు సమస్యతో బాధపడుతున్నవారు తులసి రసం తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. ముందుగా తులసి ఆకుల రసం తీసుకొని ఇందులో తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. 


నూనె-కర్పూరం:


దగ్గు ఎక్కువగా ఉంటే గొంతు నొప్పి సమస్య తలెత్తుతుంది.  దీని కోసం రెండు స్పూన్‌ల నూనె ఒక పెద్ద స్పూన్ కర్పూరం కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.


తమలపాకు:


దగ్గు తీవ్రంగా ఉన్నప్పుడు తమలపాకులు వేడి చేసి దీని రసాన్ని తేనెలో కలుపుకొని తీసుకోవాలి. 


యూకలిప్టస్:


యూకలిప్టస్ తీసుకోవడం వల్ల పొడి దగ్గు సమస్య తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను మరిగించి తర్వాత వడగట్టి ఇందులో పంచదార కలిపి మూడు పూటలా తాగితే దగ్గు తగ్గుతుంది.


Also Read  Stomach Cancer Symptoms: కడుపు కేన్సర్ తో సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురి మృతి.. లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకుందాం..


అల్లం-వెల్లుల్లి:


దగ్గు బాగా ఉనప్పుడు పాలలో అల్లం, వెల్లుల్లి రసం  తీసుకొని అందులో పసుపు వేసి తాగితే మంచి ఉపశమనం పొందవచ్చు. 


తిప్పతీగ:


కొంతమంది తరచు దగ్గుతో బాధపడు ఉంటారు. దీని కోసం తిప్పతీగ రసాన్ని నీళ్లులో కలిపి తీసుకోవడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.


తేనె, దాల్చిన్ చెక్క:  


ఈ మూడిటిని పొడి చేసి పాలలో, నీటిలో  ఉదయం, సాయంత్రం తాగితే ఉపశమనం పొందవచ్చు.


శోంఠి:


అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. శొంఠిని తేనెలో కలిపి తీసుకంటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం దొరుకుతుంది.


దానిమ్మ రసం:  


దానిమ్మ రంసంలో కొంచె అల్లం పొడి, పిప్పాలి పొడిని కలిపి తీసుకోవాలి. దీని  రెండు పూటలా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.


లవంగాలు:


నోట్లో  లవంగాలను వేసుకొని చప్పరిస్తూ గొంతు గర గర తగ్గుతుంది.


వామును:


వామును నమిలి చప్పరించడం వల్ల దగ్గును తగ్గిస్తుంది.


మిరియాల:  


తేనలో చిటికడు మిరియాల పొడి కలిపి తాగితే దగ్గు, జలుబు నయం అవుతుంది.


Also Read Spring Onion: ఉల్లి కాడలతో ఎన్నో ప్రయోజనాలు.. షుగర్‌ సమస్యకు చెక్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter