ICMR: కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లపై ఐసీఎంఆర్ గుడ్‌న్యూస్
ICMR: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా థర్డ్‌వేవ్ ముప్పు భయపెడుతోంది. అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్లపై ఎంతవరకూ పనిచేస్తాయనేది సందేహాస్పదంగా మారింది.
ICMR: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా థర్డ్‌వేవ్ ముప్పు భయపెడుతోంది. అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్లపై ఎంతవరకూ పనిచేస్తాయనేది సందేహాస్పదంగా మారింది.
దేశంలో ప్రస్తుతం మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుట్నిక్ వి వ్యాక్సిన్లు. అత్యధికంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ (Vaccination) జరుగుతోంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టినా..సెకండ్ వేవ్‌లో అత్యధిక మరణాలకు కారణమైన డెల్టా వేరియంట్(Delta Variant) వైరస్ రూపాంతరం చెంది డెల్టా ప్లస్ వేరియంట్‌గా(Delta Plus Variant)మారడం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే యూకే, అమెరికా తరువాత ఇండియాలో ఈ వేరియంట్ గుర్తించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 48 కేసులున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఫిబ్రవరి నెలలో మహారాష్ట్రలో సంభవించిన మరణాల్లో 80 శాతం డెల్టా వేరియంట్ కారణాంగానేనని పేర్కొంది. ఈ క్రమంలో దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వివిధ రకాల వేరియంట్లపై ఎంతవరకూ పనిచేస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపధ్యంలో ఐసీఎంఆర్ (ICMR)వెల్లడించిన వివరాలు ఆశాజనకంగా ఉన్నాయి. కరోనా వైరస్‌కు(Coronavirus)సంబంధించిన ఆల్ఫా, డెల్టా, గామా, బీటా వంటి అన్ని వేరియంట్లపై కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. డెల్టా ప్లస్ వేరియంట్‌పై వ్యాక్సిన్ల పనితీరుపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపింది. ఆల్ఫా వంటి వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లతో పోలిస్తే..కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల ద్వారా ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది.
Also read: Delta Plus Variant: దేశంలో భయపెడుతున్న డెల్టా ప్లస్, 11 రాష్ట్రాల్లో కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook