Cranberry Remedies: అన్ని వ్యాధులకు మూలం గట్ ఇన్ఫెక్షనే, ఎలా దూరం చేయవచ్చు
Cranberry Remedies: మనిషి ఆరోగ్యం అనేది మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టే ఉంటుంది. ఇవి సక్రమంగా ఉంటేనే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cranberry Remedies: మనిషి ఆరోగ్యానికి ప్రధాన కారణం గట్ హెల్త్. అంటే జీర్ణక్రియ పటిష్టంగా ఉండాలి. ఇది అంత సులభం కాదు. అలాగని కష్టం కాదు. ఆరోగ్యకరమైన పదార్ధాలు తింటే గట్ హెల్త్ అద్భుతంగా మెరుగుపర్చవచ్చంటారు వైద్య నిపుణులు. ఇందులో ముఖ్యమైంది క్రాన్ బెర్రీ. క్రాన్ బెర్రీ డైట్‌లో ఉండే అద్భుతమైన లాభాలుంటాయి.
గట్ ఇన్‌ఫెక్షన్ అనేది ఓ తీవ్రమైన సమస్య. దీనివల్ల చాలా సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా కడుపు నొప్పి, మలబద్ధకం, వాంతులతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్ ఇతర బ్యాక్టీరియాలకు కారణమౌతుంది. అయితే ప్రేవులు ఇన్‌ఫెక్షన్ కాకుండా కాపాడుకోవాలంటే క్రాన్ బెర్రీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. క్రాన్ బెర్రీ క్రమం తప్పకుండా తినడం వల్ల గట్ ఇన్‌ఫెక్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటేఇందులో ఏ టైప్ ప్రో ఏంథోసయానిడ్ ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. క్రాన్ బెర్రీలో ఫైబర్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యల్నించి బయటపడవచ్చు. దీనివల్ల ప్రేవుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడటంతో మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
క్రాన్ బెర్రీలో విటమిన్ సి, ఇతర పోషకాలు పెద్దఎత్తున ఉంటాయి. శరీరం ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్ దూరం చేయవచ్చు. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ సమస్య తొలగించేందుకు ఉపయోగపడుతుంది. క్రాన్ బెర్రీ అనేది యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ సమస్యను తొలగిస్తుంది. మరీ ముఖ్యంగా నోటి కేన్సర్ సమస్యను తగ్గిస్తుంది. నోట్లో ఉండే ఎసిడిటీని తగ్గిస్తుంది. అంతేకాకుండా దంతాల్లో బ్యాక్టీరియా పేరుకుపోకుండా కాపాడుతుంది.
క్రాన్ బెర్రీ అనేది బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తుంది. క్రాన్ బెర్రీ జ్యూస్ కేలరీలు తక్కువగా ఉంటాయి. దాంతో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె వ్యాధుల సమస్య దూరం అవుతుంది.
Also read: Best Juice Benefits: పోషకాల గని ఈ ఫ్రూట్ జ్యూస్, రోజూ తాగితే ఏమౌతుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.