భారతీయ వంటల్లో పెరుగన్నానికి ప్రాధాన్యత ఎక్కువ. ముఖ్యంగా దక్షణ భారతీయులకు ఇష్టమైన, తప్పనిసరి ఆహారం. బాలీవుడ్ నటి, దివంగత శ్రీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన భోజనం కూడా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగులో ప్రోబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉన్నాయి. ఇవి టెన్షన్‌ను దూరం చేస్తాయి. పెరుగన్నంతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కర్డ్ రైస్ లేదా పెరుగన్నంను ది బెస్ట్ కంఫర్ట్ ఫుడ్‌గా పిలుస్తారు. జీర్ణక్రియలో పెరుగన్నం చాలా లాభదాయకం.


ప్రోబయోటిక్స్‌కు మంచి సోర్స్ పెరుగన్నం


పెరుగు అద్భుతమైన ప్రోబయోటిక్ పదార్ధం. పెరుగు తినడం వల్ల మైక్రోబియల్ బ్యాలెన్స్ అవుతుంది. జీర్ణక్రియను మెరుగుపర్చడంలో దోహదపడుతుంది. దాంతోపాటు శరీరపు మెటబోలిజం వేగవంతమౌతుంది. పెరుగన్నం తినడం వల్ల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది. ఫలితంగా మలబద్ధకం, కడుపునొప్పి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


చలవచేసే ఆహారం


కర్డ్ రైస్ లేదా పెరుగన్నం ఒంటికి చలవ చేస్తుంది. పెరుగన్నం గుణం చలవచేసేది కావడంతో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొత్తం శరీరానికి చలవచేస్తుంది. ఇది శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఆందోళన దూరమౌతుంది. పెరుగన్నంను బెస్ట్ స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది.


పెరుగన్నం ఎలా చేయాలి


పెరుగన్నం చేయడం చాలా సులభం. చిన్న ప్యాన్‌లో తాలింపు కోసం కొద్దిగా నెయ్యి, కరివేపాకు, ఆవాలు వేయాలి. తాలింపు తరువాత అన్నం, పెరుగు వేసి బాగా కలపాలి. ఆ పై రుచి, ఫ్లేవర్ కోసం దానిమ్మ గింజలు కొన్ని వేస్తే బాగుంటుంది. 


Also read: Weight Loss Tips: ఈ టీతో మధుమేహం, బరువు తగ్గడం సమస్యలకు 14 రోజుల్లో చెక్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook