Dangerous Fruit Combinations: అరటిపండుతో పాటు ఈ ఫ్రూట్ కలిపి తింటే ఇక అంతే సంగతులు!
Dangerous Fruit Combinations: మనం రోజూ తినే ఆహారంలో పండ్లు ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. అందులో అరటి పండు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుందని చాలా మందికి తెలుసు. అయితే అరటి పండుతో పాటు మరో ఫ్రూట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి తినకూడదు. ఒకవేళ తింటే ఏం జరుగుతుందో మీరే తెలుసుకోండి.
Dangerous Fruit Combinations: అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ అరటిపండుతో పాటు కొన్ని పండ్లను కలిపి తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల విభిన్న స్వభావాలు కలిగిన పండ్లను కలిపి తింటే మీరు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది.
బొప్పాయి, అరటిపండు కలిపి తినకూడదు..
అరటిపండు తీసుకోవడం వల్ల గుండె రక్తప్రసరణతో పాటు పొట్టకు మేలు జరుగుతుంది. మరోవైపు బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దానితో పాటు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు పండ్ల భిన్నమైన స్వభావాలు కలిగి ఉండడం వల్ల ఇలాంటి హానికరమైన ఫ్రూట్ కాంబినేషన్ తినకపోవడమే మంచిది.
ఆయుర్వేదంలో వీటిని కలిపి తినడం నిషేధం. అరటి స్వభావం చల్లగా ఉంటే, బొప్పాయి ప్రభావం వేడిగా ఉంటుంది. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగకపోవడం, వాంతులు, తలనొప్పి, వికారం, అసెడిటీ, అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
బొప్పాయిని ఎవరు తినకూడదు?
1. అనేక పరిశోధనల ద్వారా ఉబ్బసం లేదా ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులు బొప్పాయి తినడం వల్ల ఆ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ముఖంపై మొటిమలు, దురద సమస్య ఉండొచ్చు. కాబట్టి అలాంటి సమస్య ఉన్న వాళ్లు బొప్పాయి తినే ముందు వైద్యుడ్ని సంప్రదించడం మేలు.
2. గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు. ఎందుకంటే దీని ప్రభావం వేడిగా ఉండడం వల్ల కడుపులో పిండాన్ని దెబ్బతీస్తుంది.
3. బొప్పాయిలోని పీచు పదార్థం మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందనేది వాస్తవం. అయితే పీచు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది.
(నోట్: పైన పేర్కొన్న సమచారమంతా కొన్ని నివేదికల ఆధారంగా సేకరించినది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Detox Drinks Benefits: శరీరంలో వ్యర్థాలను, మలినాలను తొలగించుకునేందుకు ఈ డ్రింక్స్ తాగండి!
Also Read: Milk Side Effects: మీరు అతిగా పాలు తాగుతున్నారా? అయితే మీకు ఇదో హెచ్చరిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.