ఖర్జూరం రుచిలోనే కాదు ఆరోగ్యపరంగా చాలా మంచిది. చలికాలంలో ఖర్జూరం తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు దరిచేరవు. ఖర్జూరం పండ్లు ఎలా తీంటే మంచిది, ఇందులో ఉండే రెండు రకాల్లో ఏది ఎక్కువ ప్రయోజనకరం అనేది చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖర్జూరంలో రెండు రకాలుంటాయి. ఎండు ఖర్జూరం, వెట్ ఖర్జూరం. కొంతమంది ఖర్జూరం పండ్లను స్వీట్స్‌లో వినియోగిస్తారు. ఇంకొంతమంది హల్వా రూపంలో తీసుకుంటారు. కొంతమంది లడ్డూల్లో మిక్స్ చేసి తింటారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాకుండా ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎండు ఖర్జూరం, వెట్ ఖర్జూరంలో ఏది మంచిదో పరిశీలిద్దాం..


1. ఎండు ఖర్జూరం స్వభావరీత్యా వెట్ ఖర్జూరంతో పోలిస్తే వేడి ఎక్కువ. మీ బాడీలో పిత్తం ఎక్కువగా ఉంటే..వెట్ ఖర్జూరం మంచిది. వాతం విషయంలో ఎండు ఖర్జూరం మంచిది.


2. డయాబెటిస్ రోగులకు సైతం వెట్ ఖర్జూరం చాలా మంచిది. ఎండు ఖర్జూరం సమస్యను ఇంకాస్త పెంచవచ్చు. కడుపులో నొప్పి, మలబద్ధకం లేదా అజీర్ణం సమస్య ఉంటే ఎండు ఖర్జూరం తినాల్సి ఉంటుంది. 


3. చాలామంది బరువు పెంచుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ విఫలమౌతుంటారు. ఈ క్రమంలో వెట్ ఖర్జూరం డైట్‌లో భాగంగా చేసుకుంటే బరువు వేగంగా పెరుగుతారు.


Also read: Health Drinks: వారంలో ఏడు రోజులు..ఈ ఏడు డ్రింక్స్ తీసుకుంటే చాలు, వ్యాధులు దూరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook