COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Top 4 Health Benefits Of Dates: తీపి కలిగిన ఆహారాలు తినడం వల్ల శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా తీపి తినేవారిలో శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా మంది ఆలోచన రావచ్చు. ఖర్జూర పండ్లు కూడా తీపిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల వస్తాయని..ఇలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని శరీరానికి కావాల్సిన సహజ చక్కెర అధిక పరిమాణాల్లో లభిస్తుంది. అంటేకాకుండా ఇందులో అధికంగా పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఖర్జూరను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు. 


ఖర్జూరం తినడం వల్ల  కలిగే లాభాలు:
ఎముకలను దృఢంగా చేస్తాయి:

ఖర్జూరంలో లభించే అధిక పోషకాలు శరీరంలోని ఎముకలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో అధిక పరిమాణంలో క్యాల్షియం, సెలీనియం, మాంగనీస్, కాపర్ కూడా లభిస్తుంది. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. 


రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ఖర్జూర పండ్లను పాలలో నానబెట్టి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్


చర్మానికి మేలు చేస్తుంది:
ప్రతి రోజు ఖర్జూర తినేవారిలో చర్మ సమస్యలు రావడం చాలా అరుదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో చర్మానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల ముఖం, చర్మం మెరుస్తుంది. 


శరీర బరువును పెంచేందుకు సహాయపడుతుంది:
సన్నని శరీరంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఖర్జూర పండ్లను తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో అధిక పరిమాణంలో సహజ చక్కెర, విటమిన్లు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్స్‌ లభిస్తాయి. అంతేకాకుండా సులభంగా శరీర ఆకృతిని పొందుతారు.


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి