Delta Variant: కరోనా మహమ్మారి రూపాంతరం చెందుతూ వివిధ రకాల వేరియంట్లతో విలవిల్లాడిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో విపత్కర పరిస్థితులకు కారణమైన డెల్టా వేరియంట్‌పై ఇంగ్లండ్ హెల్త్ విభాగం కీలక సూచనలు చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి ఇండియా సహా చాలా దేశాలు విలవిల్లాడాయి. ముఖ్యంగా ఇండియాలో భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడీ డెల్టా వేరియంట్ ప్రపంచంలోని ఇతర దేశాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలో పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ చేసిన అధ్యయనం కీలక విషయాల్ని వెల్లడించింది. ముఖ్యమైన సూచనలు చేస్తోంది. 


2020లో కరోనా వైరస్ ప్రారంభమైనప్పుడు వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్(Alpha Variant) కంటే సెకండ్ వేవ్‌లో కన్పించిన డెల్టా వేరియంట్(Delta Variant) అత్యంత ప్రమాదకరమని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా డెల్టా వేరియంట్‌తో ఆసుపత్రి పాలయ్యే ముప్పు అధికమని పీహెచ్ఈ అధ్యయనం తెలిపింది. పీహెచ్ఈ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. అధ్యయనం వివరాలు లాన్సెట్ జనరల్‌లో ప్రచురితమయ్యాయి. ఏ వేరియంట్ కారణంగా ఆసుపత్రిలో పాలవుతున్నారనే విషయంపై ఇదే తొలి అధ్యయనం. 2020 మార్చ్ నుంచి 2021 మే వరకూ ఇంగ్లండ్‌లో కరోనా సోకిన 43 వేల 338 మందిని పరిశీలించారు. ఇందులో 75 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే ఉన్నట్టు తేలింది. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్(Delta Variant) సోకిన రోగులు తీవ్ర లక్షణాలతో ఇబ్బంది పడనున్నారంటూ గతంలో వెల్లడైన అంశాల్ని ఈ అధ్యయనం మరోసారి పరిశీలించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో డెల్టా వేరియంట్ ప్రభావంగా తక్కువగా ఉండగా..తీసుకోనివారిలో ఎక్కువగా కన్పిస్తోంది. వ్యాక్సిన్ తీసుకుంటే..కరోనా వైరస్ సోకినా సరే తీవ్రత తక్కువగా ఉంటుందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(Public Health England)అధ్యయనం విశ్లేషించింది. 


Also read: Covaxin Vaccine: కోవిడ్ బాధితులకు ఆ వ్యాక్సిన్ సింగిల్ డోసు చాలంటున్న ఐసీఎంఆర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook