Dengue Day Theme 2023: వేసవి, వర్షాకాలంలో ఇంటి చుట్టూ దోమల సంఖ్య పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా అనేక రకాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా చాలా బందిలో వైరల్ వ్యాధులు, డెంగ్యూ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే డెంగ్యూ కారణంగా రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య క్రమంగా తగ్గే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి శరీరంలో ఒక్కసారిగా తగ్గడం కారణంగా ప్రాణాంతక సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా దోమలను నియంత్రించడానికి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి సంవత్సరం పెరుగుతున్న డెంగ్యూ కేసులు, వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి  ప్రభుత్వాలు డెంగ్యూపై అవగాహన కల్పిస్తున్నాయి. అంతేకాకుండా చికిత్సపై కూడా అవగాహన కల్పించే లక్ష్యంతో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.


Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  


జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?:


డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.


డెంగ్యూకి సంబంధించిన సమాచారం:
డెంగ్యూ ఇన్ఫెక్షన్ ప్రధానంగా ఏడిస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది.
శరీరంలో డెంగ్యూ ఒక్కసారి వ్యాపిస్తే  2 నుంచి 7 రోజుల వరకు ఉంటాయి.
దీని కారణంగా జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వేగంగా రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. 
డెంగ్యూ వచ్చివారు తప్పకుండా విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే ప్రాణాంతకంగా మారే ఛాన్స్‌ కూడా ఉంది. 


డెంగ్యూ దినోత్సవ థీమ్:
ప్రతి సంవత్సరం డెంగ్యూ దినోత్సవానికి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం జాతీయ డెంగ్యూ దినోత్సవం థీమ్ 'డెంగ్యూని మనమందరం కలిసి తరిమికొడదాం'.


Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి