How to Identify Depression Symptoms: కరోనా తరువాత చాలా మంది ప్రజలు ఒత్తిడి, డిప్రెషన్ మొదలైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. డిప్రెషన్ అని మనం అనేస్తాం కానీ దాన్ని అనుభవిస్తున్న వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డిప్రెషన్ మూడ్ డిజార్డర్‌కు దారి తీస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో దీన్నీ ఎంత ఆలస్యం చేస్తే అంత ఇబ్బంది పడక తప్పని పరిస్థితి. ఈ డిజార్డర్ మనిషి రోజువారీ పనులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ డిప్రెషన్ ఉన్నప్పుడు వారాలు, నెలలు ఇబ్బంది తప్పదు.  డిప్రెషన్   కొన్ని సాధారణ లక్షణాలు   సమస్యలు తెలుసుకోండి. ఈ 10 లక్షణాలు, సంకేతాలను కనుక మీలో ఉంటే, అప్పుడు మీరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని అర్థం చేసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 డిప్రెషన్   సాధారణ లక్షణాలు 
ఆకలిని కోల్పోవడం, ఇష్టమైన పనులపై ఆసక్తి కోల్పోవడం, శక్తి కోల్పోవడం, ఏకాగ్రతలో ఇబ్బంది, నిర్ణయాలు తీసుకోలేకపోవడం   నిద్రలేమి వంటి నిద్ర సమస్యలు ఉంటాయి. దీర్ఘకాలిక డిప్రెషన్ సకాలంలో చికిత్స చేయకపోతే ఆత్మహత్య ఆలోచనలకు దారి తీస్తుంది. 


ఇక డిప్రెషన్  లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి: -


  • దూకుడు

  • చిరాకు

  • ఆత్రుత

  • అశాంతి

  • లైంగిక కోరిక తగ్గడం

  • అలసట

  • తలనొప్పి

  • శూన్యం అనుభూతి

  • ఆందోళన

  • ఆకలి లేకపోవడం

  • డిప్రెషన్  వల్ల వచ్చే సమస్యలు

  • అధిక బరువు లేదా ఊబకాయం, ఇది గుండె జబ్బులకు, మధుమేహానికి దారి తీస్తుంది.

  • మద్యం, మాదకద్రవ్యాల దుర్వినియోగం.

  • ఆందోళన, పానిక్ డిజార్డర్ లేదా సోషల్ ఫోబియా.

  • కుటుంబ కలహాలు

  • వర్క్ ప్లేస్ ప్రోబ్లం

  •  విద్యా సమస్యలు.

  • సమాజంలోకి వెళ్లకుండా విడిగా ఉండడం.

  • ఆత్మహత్యా ఆలోచనలు.


Also Read: Premature Ageing: చిన్న వయసులోనే అకాల వృద్ధాప్య సంకేతాలతో బాధపడుతున్నారా?, ఈ 5 నియమాలు మీ కోసమే!


Also Read: Summer Drinks: వేసవిలో మసాలా జీరా డ్రింక్‌ తాగితే ఎన్ని లాభాలో కలుగుతాయో తెలుసా?



 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook