డయాబెటిస్ వ్యాధి శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ లోపంతో తలెత్తుతుంది. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా లేకపోతే రక్తంలో షుగర్ శాతం పెరిగిపోతుంటుంది. డయాబెటిస్ ఒకసారి సోకిందంటే ఇక జీవితాంతం వెంటాడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు సరైన డైట్, జాగ్రత్తలతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తినే ఆహారంలో ఉండే డయాబెటిస్, కార్బోహైడ్రేట్లు బ్లడ్ షుగర్‌ను వేగంగా పెంచేస్తాయి. అయితే మనం తినే ఆహార పదార్ధాల ద్వారా బ్లడ్ షుగర్ నియంత్రణ సాధ్యమే. డైట్‌లో కొన్ని రకాల నట్స్ చేర్చితే షుగర్ పెరగకుండా నియంత్రించవచ్చు. డయాబెటిస్ నియంత్రణకు ఏ విధమైన నట్స్ తీసుకోవాలనేది తెలుసుకుందాం..


పిస్తా


పిస్తా గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇవి తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. పిస్తా తినడం వల్ల డయాబెటిస్ పెరగకుండా నియంత్రించవచ్చు.


చిరౌంజీ


చిరౌంజీతో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే పోషక పదార్ధాలతో గ్లూకోజ్ లెవెల్స్ సాధారణ స్థితికి చేరుతాయి. చిరౌంజీను పాలలో కలిపి తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. 


బాదం


బాదం పోషక పదార్ధాలకు నిలయం. డయాబెటిస్ వ్యాదిగ్రస్థులు బాదం తింటే చాలా చాలా మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్ ఇ, విటమిన్ బి 12, మెగ్నీషియం, న్యూట్రియంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. బాదం గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణలో దోహదపడుతుంది.


ములగకాయ


ములగకాయను పేదల బాదంగా చెబుతారు. ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, ఫ్యాట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి. ములగకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందుకే ములగకాయ డయాబెటిస్ రోగులకు చాలా లాభదాయకంగా ఉంటుంది.


వాల్‌నట్స్


వాల్‌నట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. బ్లడ్ షుగర్ నియంత్రిస్తే వాల్‌నట్స్‌ను డైట్‌లో భాగంగా చేసుకోవాలి.


జీడిపప్పు


జీడిపప్పులో యాంటీ డయాబెటిక్ గుణాలున్నాయి. వీటిని తినడం వల్ల పంచదార, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ రోగులు నానబెట్టిన జీడిపప్పు రోజూ తింటే చాలా ప్రయోజనాలుంటాయి.


Also read: Bad Cholesterol: రక్త నాళికల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయిందా..ఈ పదార్ధాలు దూరంగా పెట్టాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook