Bad Cholesterol: రక్త నాళికల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయిందా..ఈ పదార్ధాలు దూరంగా పెట్టాలి

Bad Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంది. ముఖ్యంగా కొరోనరీ ఆర్ట్ డిసీజ్ తలెత్తుతుంది. రక్త నాళికలు బ్లాక్ అవుతాయి. ఇది చాలా ప్రమాదకరం. కొన్ని పదార్ధాల్ని తినడం మంచిదని సూచిస్తున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 22, 2023, 11:23 AM IST
Bad Cholesterol: రక్త నాళికల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయిందా..ఈ పదార్ధాలు దూరంగా పెట్టాలి

చెడు కొలెస్ట్రాల్ వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంది. రక్త నాళికల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండె వరకూ రక్తం సరఫరా కాదు. ఇవి రక్త సరఫరాపై ప్రభావం పడి..వివిధ వ్యాధులకు కారణమౌతుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది. హై కొలెస్ట్రాల్ కారణంగా గుండె వ్యాధులు రావచ్చు. రక్త నాళికల్ని బ్లాక్ చేయవచ్చు. స్టెంట్ వేసే పరిస్థితికి దారి తీయవచ్చు. ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. కొలెస్ట్రాల్‌ను పెంచే పదార్ధాలు ఏంటనేది తెలుసుకుందాం..

ఇటీవలి కాలంలో ప్రతి వస్తువుతో బటర్ తినడం సాధారణమైపోయింది. బటర్ అనేది కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతుంది. రక్త నాళికల్లో ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. బటర్‌తో కొవ్వు పెరగడం వల్ల హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులు తలెత్తవచ్చు. అందుకే బటర్ వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి.

ఫ్రైడ్ పదార్ధాలు

డీప్ ఫ్రైడ్ పదార్ధాల వల్ల కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. ఫలితంగా హార్ట్ బ్లాకేజ్ సంభవిస్తుంది. హార్ట్ ఎటాక్, స్టెంట్ సర్జరీ వంటి పరిస్థితులకు దూరంగా ఉండాలంటే సాధ్యమైనంతవరకూ మసాలా పదార్ధాలకు దూరంగా ఉండాలి. 

ఫాస్ట్ ఫుడ్స్

ఫాస్ట్ ఫుడ్స్ గుండెకు హాని కారకం. పిజ్జా, బర్గర్ వంటి వస్తువులు మైదా, ఆర్టిఫిషియల్ ఇంగ్రెడియంట్స్‌తో నిర్మితమౌతాయి. ఒకవేళ గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే ఈ పదార్ధాలను దూరంగా పెట్టాలి.

బిస్కట్స్, టోస్ట్

ఉదయం టీతో పాటు చాలామంది బిస్కట్ లేదా టోస్ట్ తినడాన్ని ఇష్టపడతారు. వీటిలో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. గుండె వ్యాధులకు దారి తీస్తుంది. ఒకవేళ కొలెస్ట్రాల్ పెరగడం నియంత్రించాల్సి ఉంటుంది. బిస్కట్ వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి.

ఐస్ క్రీమ్

ఐస్ క్రీమ్ అంటే సహజంగా ఇష్టపడనివారుండరు. అద్భుతమైన రుచి కావడంతో చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. కానీ గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఐస్ క్రీమ్ తినడం చాలా ప్రమాదకరం. వెనీలా ఐస్ క్రీమ్ కారణంగా కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. 

Also read: Diabetes Control: ఊలాంగ్ టీతో డయాబెటిస్‌కి 7 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు.. ఈ తీవ్ర వ్యాధులకు చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News