కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎక్కువకాలం కొలెస్ట్రాల్ ఉంటే చాలా వ్యాధులకు దారి తీస్తుంది. అందుకే సాధ్యమైనంతవరకూ కొలెస్ట్రాల్ తగ్గించాల్సి ఉంటుంది. రక్త నాళికల్లో కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే..వివిధ రకాల వ్యాధులకు దూరంగా ఉండాలంటే..ముందు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించుకోవాలి. దీనికోసం ఎలాంటి ఫుడ్స్ అవసరమో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిస్మిస్ ప్రయోజనాలు


ఒకవేళ మీరు కార్బొహైడ్రేట్స్ ఫైబర్, విటమిన్లు వంటి పోషకాల్ని ఒకేసారి పొందాలనుకుంటే..కిస్మిస్ తినడం ప్రారంభించండి. ఇందులో కాల్షియం వంటి మినరల్స్ ఉంటాయి. దాంతో ట్రై గ్లిసరాయిడ్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఫైటోకెమికల్స్ ,ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంతో దోహదపడతాయి.


మెంతులతో కొలెస్ట్రాల్ నియంత్రణ


మెంతుల్లో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచుతాయి అంతేకాకుండా బ్లడ్ కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరాయిడ్స్ లెవెల్స్ తగ్గుతాయి. రక్త సరఫరాను మెరుగుపర్చేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లోవిన్ వంటి పోషకాలుంటాయి. అంతేకాకుండా ఐరన్, కాల్షియం, కాపర్ ఉంటాయి.


బాదం


బాదంలో విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. 


ఫ్లెక్స్ సీడ్స్ ప్రయోజనాలు


ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ఫ్లెక్స్‌సీడ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీంతోపాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ నియంత్రణలో దోహదమౌతాయి.


సన్‌ఫ్లవర్ సీడ్స్ లాభాలు


సన్‌ఫ్లవర్ ఆయిల్ ఒక్కటే కాదు. విత్తనాల్లో కూడా ఔషధ గుణాలుంటాయి. ఈ పోషక గుణాలతో కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. నూనె కూడా సన్‌ఫ్లవర్ నూనె మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి.


Also read: Diabetes Tips: ఈ ఐదు రకాల ఆకుల్ని తీసుకుంటే..మధుమేహం నియంత్రణ ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook