Diabetes Tips: ఈ ఐదు రకాల ఆకుల్ని తీసుకుంటే..మధుమేహం నియంత్రణ ఖాయం
Diabetes Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ మందులు తీసుకోవల్సిందే. అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఐదు రకాల ఆకుల్ని తినడం వల్ల డయాబెటిస్ కచ్చితంగా నియంత్రణలో ఉంటుంది.
డయాబెటిస్ అనేది చాలా రకాల వ్యాధులకు కారణమౌతుంది. అందుకే డయాబెటిస్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. రోజూ కొన్ని రకాల ఆకుల్ని తీసుకోవడం వల్ల మధుమేహం పూర్తిగా నియంత్రణలో ఉంటుంది.
డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైంది. ఒకసారి సోకిందంటే ఇక జీవితాంతం మందులు వాడుతుండాల్సిందే. అదే సమయంలో కొన్ని రకాల ఆకుల్ని తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వల్ల మందుల అవసరం ఉండకపోవచ్చంటున్నారు. ఇందులో ప్రధానమైనవి తులసి ఆకులు. వీటిపై 2019లో అధ్యయనం కూడా జరిగింది. అదే విధంగా జైతూన్ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి.
తులసి ఆకులతో కలిగే ప్రయోజనాలు
భారతదేశంలో అత్యంత ప్రాచీన ప్రాకృతిక వైద్య విధానంలో ఒకటి తులసి ఆకులు. 2019లో జరిగిన ఓ అధ్యయనంలో కూడా తులసి ఆకుల విశిష్టత, లాభాల గురించి తేలింది. తులసి ఆకుల రసంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
జైతూన్ ఆకులు
ఒకవేళ మీరు టైప్ 2 డయాబెటిస్ ముప్పును తగ్గించాలంటే జైతూన్ ఆకుల వినియోగం తప్పనిసరి. ఎందుకంటే ఓ రీసెర్చ్ ప్రకారం జైతూన్ ఆకుల వినియోగంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెరుగవుతుంది.
పొడపత్రి ఆకులు
ఇండియాలో వివిధ రకాల ఆయుర్వేద ముూలికలు, మొక్కలతో మధుమేహం నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రోగులకు పొడపత్రి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుందని తేలింది.
స్టేవియా లేదా స్వీట్ తులసి
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం స్టేవియా ఆకులు డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 2018లో జరిగిన ఓ రీసెర్చ్‌లో స్టేవియా ఆకులు తిన్పించిన రోగుల్లో డయాబెటిస్ రెండు గంటల్లోనే తగ్గినట్టుగా పరిశోధకులు తెలిపారు.
టర్నిప్ ఆకుల వినియోగం
టర్నిప్ ఆకుల్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే రోజూ టర్నిప్ తీసుకోవచ్చు. ఒక కప్పులో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. రీసెర్చ్ ప్రకారం టైప్ 1 డయాబెటిస్ రోగులు రోజూ ఫైబర్ ఆహారం తీసుకుంటే..బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ రోగులకు బ్లడ్ షుగర్, ఇన్సులిన్, లిపిడ్ స్థాయి మెరుగుపడతాయి.
Also read: Cholesterol Remedy: ఈ పండుతో ధమనుల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌కు 12 రోజుల్లో చెక్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook