Diabetes Control Food: డయాబెటీస్ ను పూర్తిగా తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే!
Diabetes Control Food: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారంలో మార్పలు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Diabetes Control Food: మధుమేహంతో బాధపడుతున్నవారు తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. దీంతో చాలా మందిలో రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి తీవ్ర దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకుంటే సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చు.ఇలాంటి ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా సులభంగా కరిగిపోతుంది. మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడానికి ఈ ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ ఆహారాలు మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు తీసుకోండి:
ఓట్స్:
ఓట్స్‌తో కూడిన ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో ఫైబర్ కూడా లభిస్తుంది. కాబట్టి సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గిస్తుంది.
గుడ్లు:
ఉడికించిన గుడ్లు కూడా శరీరానికి చాలా మంచిది. ఇందులో అధిక పరిమాణంలో ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారంలో గుడ్లను తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
అవకాడో:
అవకాడోలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్ అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బెర్రీలు:
బెర్రీలు ఆరోగ్యాని చాలా మేలు చేస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గి..రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Low Blood Pressure: ఈ ప్రాణాయామంతో కేవలం 10 రోజుల్లో లో బీపీ మాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి