Diabetes Remedies: ప్రపంచంలో ప్రతియేటా లక్షలాదిమంది మధుమేహం బారిన పడుతున్నారు. డయాబెటిస్ అనేది ప్రమాదకర వ్యాధి. మధుమేహం కారణంగా ఇతర వ్యాధులు వస్తుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోయినా లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా మధుమేహ వ్యాధి తలెత్తుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం సహా చాలా చికిత్సా పద్ధతులున్నాయి. డయాబెటిస్ నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆయుర్వేదంలో చాలా రకాల మూలికలు మధమేహానికి అద్భుతంగా పనిచేస్తాయి. ది ఇండిపెండెంట్‌లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం డయాబెటిస్ నియంత్రించేందుకు సులభమైన, అద్భుతమైన విధానముంది. మీ కిచెన్‌లో లభించే ఉల్లిపాయతోనే బ్లడ్ షుగర్‌ను 50 శాతం తగ్గించవచ్చు.


శ్యాన్ డియెగోలో జరిగిన ది ఇండోక్రైన్ సొసైటీ సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఉల్లిపాయ రసం బ్లడ్ షుగర్ తగ్గించేందుకు మెటాఫార్మిన్‌లా పనిచేస్తుంది. ఉల్లిపాయతో డయాబెటిస్ రోగులు బరువు కూడా తగ్గుతారు. ఆరోగ్యపరంగా చాలా ఇతర ప్రయోజనాలున్నాయి.


ఈ అధ్యయనం ఎలుకలపై జరిగింది. ఎలుకలకు 400 ఎంజీ, 600 ఎంజీ ఉల్లిపాయ రసం ఇచ్చారు. ఫలితంగా ఎలుకల బ్లడ్ షుగర్‌లో 50 శాతం, 35 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఫలితాలు పరిశోధకులకు సైతం ఆశ్చర్యం కల్గించాయి. భవిష్యత్తులో ఈ పరిశధన ఫలితాలు మనుష్యులపై కూడా చేయనున్నారు. 


Also read: Diabetes Control Tips: మధుమేహంతో బాధపడుతున్నవారికి గుడ్‌ న్యూస్‌.. రోజూ ఇలా చేయండి చాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook