Diabetes Tips: డయాబెటిస్ వ్యాధి ప్రస్తుతం ఓ పెను సమస్యగా మారిపోయింది. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని డైట్‌లో చేర్చుకుంటే తప్పకుండా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్ సమస్య ఇటీవలి కాలంలో సర్వ సాధారణమైపోయింది. ఓ అధ్యయనం ప్రకారం ప్రతి ముగ్గురిలో ఇద్దరికి డయాబెటిస్ ఉందంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహార పదార్ధాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. డయాబెటిస్‌కు ఎలా చెక్ పెట్టాలి మరి..


బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించేందుకు ముఖ్యంగా చేయాల్సింది లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లలో మార్పులు. జీవనశైలి బాగుంటే బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. భోజనానంతరం బ్లడ్ షుగర్ లెవెల్ 140 వరకూ ఉంటే ఫరవాలేదు. అదే పరగడుపున 110 దాటకూడదు. సరైన జాగ్రత్తలు, ఆహార పదార్ధాలు తీసుకుంటే మధుమేహం నియంత్రించవచ్చు.


పప్పు, శెనగలు, బీన్స్ వంటివి డైట్‌లో భాగంగా చేసుకోవాలి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. తృణధాన్యాలైన ఓట్స్, క్వినోవా, గోధుమలను డైట్‌లో భాగం చేయాలి. వీటిని సేవించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది. 


పెరుగు కూడా బ్లడ్ షుగర్ నియంత్రించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. మధుమేహం రోగులకు పెరుగు తప్పకుండా ఇవ్వాలి. పెరుగు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ఫలితంగా మధుమేహం నియంత్రణకు దోహదపడుతుంది.


మధుమేహం నియంత్రణలోడ్రై ఫ్రూట్స్ అత్యద్భుతంగా పనిచేస్తాయి. బ్లడ్ షుగర్ నియంత్రణలో డ్రైఫ్రూట్స్ సహాయపడతాయి. ఇందులో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి.


Also read: Healthy Drinks: డయాబెటిస్, కొలెస్ట్రాల్ ఇతర వ్యాధుల్ని దూరం చేసే 5 అద్భుత డ్రింక్స్ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook