డయాబెటిస్ అనేది ప్రస్తుతం సాధారణమైపోయింది. భారతదేశంలో చాలామంది మధుమేహానికి గురవుతున్నారు. మధుమేహం రోగులు ప్రధానంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. అప్పుడే జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్ రోగులకు బ్లడ్ షుగర్ వేగంగా పెరుగుతుంది. ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లడ్ షుగర్ పెరగడం వల్ల పళ్లపై దుష్ప్రభావం


డయాబెటిస్ అనేది చాలా రకాల వ్యాధులకు మూలం. డయాబెటిస్ ఉంటే గుండె వ్యాధులు, కిడ్నీ వ్యాధులు సహా చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే ఆ ప్రభావం పళ్లపై పడుతుంది. 


కేవిటీ సమస్య


నోట్లో బ్యాక్టీరియాకు చాలా కారణాలుంటాయి. అదే సమయంలో మధుమేహం ఉంటే పళ్లకు నలువైపులా ఒక లేయర్ ఏర్పడుతుంది. దీనినే ప్లాక్ అంటారు. ఈ ప్లాక్ లో ఓ విధమైన యాసిడ్ ఉంటుంది. క్రమ క్రమంగా పళ్లను దెబ్బ తీస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నప్పుడు షుగర్, స్టార్ట్ వేగంగా శరీరంలో కరుగుతుంటుంది. దాంతో కేవిటీ సమస్య ఏర్పడుతుంది. 


పంటి చిగుళ్ల వ్యాధి


డయాబెటిస్ ప్రభావం రోగ నిరోధక శక్తిపై పడుతుంది. ఇమ్యూనిటీ పడిపోయే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇతర వ్యాధులు తలెత్తుతాయి. చిగుళ్ల వ్యాధి కూడ రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడే వస్తుంది. చిగుళ్లలో స్వెల్లింగ్ సమస్య ఏర్పడుతుంది. 


డయాబెటిస్ రోగులు పళ్ల సమస్య నుంచి ఎలా కాపాడుకోవాలి


బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుుడు నియంత్రణలో ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు పరీక్షలు అవసరం. ప్రతి రోజూ ఉదయం లేచినవెంటనే, తిరిగి రాత్రి వేళ బ్రష్ తప్పకుండా చేయాలి. రెండు పళ్ల మధ్య ఇరుక్కునే వ్యర్ధాల్ని తొలగించేందుకు డెంటల్ ప్లాస్ వినియోగించాలి. సిగరెట్, మద్యం, చల్లని పానీయాలకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా డెంటిస్ట్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి.


Also read: Cholesterol Tips: కొలెస్ట్రాల్ పెరిగితే వచ్చే సమస్యలేంటి, ఎలా గుర్తించాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook