ఇండియాలో డయాబెటిస్ రోగుల సంఖ్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి డయాబెటిస్‌కు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ క్రమంలో స్వీట్స్, పంచదారను పూర్తిగా మానేయాలని సూచిస్తుంటారు వైద్యులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం వ్యాధి నియంత్రణకు చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. జీవనశైలి మారాలి. రోజూ వ్యాయామం ఉండాలి. మధుమేహం వ్యాధిగ్రస్థులు పంచాదర, స్వీట్స్ మానేయాల్సి వస్తుంది. కానీ ఆరోగ్యపరంగా పంచదార పూర్తిగా మానడం మంచిది కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫలితంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. పంచదార మానడం వల్ల కలిగే సైడ్‌ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం..


పంచదార అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సహజసిద్ధమైంది కాగా రెండవది ప్రోసెస్డ్. సహజసిద్ధంగా ఉండే పంచదారలో మామిడి, పైనాపిల్, లిచ్చీ, కొబ్బరికాయ వంటి పండ్లున్నాయి. కానీ ప్రోసెస్డ్ షుగర్‌లో చెరకు, బీట్‌రూట్ ఉన్నాయి. పంచదారను నియంత్రించడం మంచిదే కానీ పూర్తిగా మానకూడదు. 


ప్రోసెస్డ్, నేచురల్ షుగర్ మద్య తేడా


చెరకు, బీట్‌రూట్‌లతో ప్రోసెస్ చేసే సుక్రోజ్‌లో కేలరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏ విధమైన న్యూట్రియంట్ విలువలు ఉండవు. కానీ నేచురల్ షుగర్‌లో విటమిన్స్, మినరల్స్ పెద్దమొత్తంలో ఉంటాయి. స్వీట్స్ అనేది సహజంగా ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. అందుకే పూర్తిగా వదలడం సాధ్యం కాదు. అలాగని పూర్తిగా మానేసినా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. 


పంచదార మానేయడం వల్ల కలిగే దుష్పరిణాణాలు


ఒకేసారి పంచదార మానేస్తే..మత్తు పదార్ధాలు ఒక్కసారిగా మానేస్తే ఎలా ఉంటుందో ఆ పరిస్థితి ఉంటుందని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. ఫలితంగా త్వరగా అలసట వస్తుంది. తలనొప్పి సమస్య వేధిస్తుంది. చికాకు ఎక్కువగా ఉంటుంది.


నేచురల్ షుగర్ మానకూడదు


పంచదార మానేయడం వల్ల ఆ ప్రభావం శరీరంపై నెమ్మది నెమ్మదిగా పడుతుంది. నేచురల్ షుగర్ అనేది ఎనర్జీ సోర్స్‌కు మూలం. అందుకే పూర్తిగా మానేయడం వల్ల అలసట తీవ్రమౌతుంది. పంచదార మానేస్తే..శరీరంలోని అదనపు ఇన్సులిన్ తగ్గుతుంది. ఒకవేళ ప్రోసెస్డ్ షుగర్ మానేసినా..పండ్లు మానవద్దు. నేచురల్ షుగర్ లభించడం వల్ల శరీరంలో ఎనర్జీ కొనసాగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆహారపు అలవాట్లను నియంత్రణలో ఉంచుకోవడమే అత్యుత్తమ మార్గం. కానీ పంచదారను పూర్తిగా మానేసినా..నేచురల్ స్వీట్స్ ఉండే పండ్లు మానకుండా ఉండాలి. లేకపోతే శరీరానికి కావల్సిన శక్తిలో అసమతుల్యత ఏర్పడుతుంది. 


Also read: Vegetable Juice For Diabetes: ఈ 'మ్యాజిక్‌ జ్యూస్‌'తో శాశ్వతంగా ఎలాంటి ఖర్చు లేకుండా మధుమేహం, అధిక రక్తపోటుకు చెక్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook