Diabetes Risk: మనిషి ఆరోగ్యం అనేది సుఖమైన నిద్రతో ముడిపడి ఉంటుంది. చాలామందికి రాత్రి వేళ నిద్ర సరిగ్గా రాదు. వాస్తవానికి ఈ సమస్యను అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే రాత్రి వేళ నిద్ర పట్టకపోవడమనేది నేరుగా మధుమేహం వ్యాధితో ముడిపడి ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎవరికైతే రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా పట్టదో వారికి డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉందని అర్ధం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే  నిద్రకు ఆరోగ్యానికి చాలా లోతైన సంబంధముందంటారు వైద్యులు. నిద్ర సరిగ్గా పట్టకపోతే కేవలం మధుమేహమే కాదు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వెంటాడవచ్చు. రాత్రి నిద్ర చాలా కీలకమైంది. రోజూ రాత్రి వేళ 7 గంటలు కనీసం మంచి నిద్ర ఉండాలి. ఇది లేకుంటే మధుమేహం ముప్పు పెరిగిపోతుంది. నిద్రించే సమయంలో తరచూ హెచ్చుతగ్గులు వస్తుంటే వారిలో డయాబెటిస్ ముప్పు అధికంగా ఉంటుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం ఎవరికైతే నిద్ర సమయం 31 నుంచి 45 నిమిషాలు వరకూ మారుతుంటుందో వారిలో డయాబెటిస్ ముప్పు 15 శాతం పెరుగుతుంది. అదే నిద్ర సమయం 60 నిమిషాలు దాటి మారుతుంటే వారిలో డయాబెటిస్ ముప్పు 59 శాతం అధికంగా ఉంటుంది. ఈ అధ్యయనం యూకే బయోబ్యాంక్ నుంచి 84 వేలమందిపై చేశారు. వీరికి వరుసగా వారం రోజులు ఎక్సెలెరోమీటర్ తొడిగించారు. తద్వారా ఆ వ్యక్తుల స్లీప్ పాటర్న్ పరిశీలించారు.


ఈ అధ్యయనం ద్వారా మరో విషయం స్పష్టమైంది. ఎవరైతే ఎక్కువగా లేదా తక్కువ నిద్రపోతుంటారో వారిలో డయాబెటిస్ ముప్పు అధికంగా ఉంది. ఎక్కువగా నిద్రించేవారిలో మధుమేహం ముప్పు 34 శాతం పెరిగింది. నిద్రకు మధుమేహానికి మధ్య సంబంధంపై గతంలో కూడా చాలా అధ్యయనాలు జరిగాయి. నిద్ర తక్కువైతే ఇమ్యూనిటీ బలహీనమౌతుంది. అధిక రక్తపోటు, స్థూలకాయం, ఒత్తిడి, గుండె వ్యాధుల సమస్యలు పెరుగుతాయి.


మీక్కూడా నిద్ర సంబంధిత సమస్య ఉంటే తక్షణం అప్రమత్తమవండి. రోజూ తగిన వ్వవధిలో నిద్రించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. రోజూ నిద్ర పోయేందుకు ఓ నిర్ణీత సమయం ఎంచుకోవాలి. నిద్రించడానికి ముందు ఫోన్ వినియోగం మానేయాలి. నిద్రించే ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి. తద్వారా మంచి నిద్ర పడుతుంది. ఎందుకంటే ప్రశాంతమైన నిద్ర ఎప్పుడూ ఆరోగ్యాన్నే ఇస్తుంది.


Also read: Knee Pains: మోకాలి నొప్పులతో బాధపడుతున్నారా, చిటికెలో మాయం చేసే 3 చిట్కాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook