Diabetes Friendly Tea: హై బ్లడ్ షుగర్  లేదా డయాబెటిస్ ఉన్నవాళ్లు మన ఇండియాలో 100 మిలియన్ ఉన్నారు ఐసిఎంఆర్  తెలిసింది డయాబెటిస్ ఉన్నవారు సరైన జీవన శైలిని అనుసరిస్తూ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే, ఈ 5 టీ లు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడతాయి. ఉదయం ఈ టీ లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్లు ఈ సాధారణ టీ తాగడం మానేసి ఈ డయాబెటిస్‌ ఆరోగ్యకరమైన టీ లు తీసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రీన్ టీ
గ్రీన్ టీ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగనివ్వకుండా కాపాడతాయి. కొన్ని నివేదికల ప్రకారం గ్రీన్ టీలో గ్లూకోస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ వారికి గ్రీన్ టీ మంచిది. ఒబేసిటీ ఉన్న వారికి కూడా గ్రీన్ టీని డైట్ లో చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా గ్రీన్ టీ తాగాలి.


 బ్లాక్ టీ..
బ్లాక్ టీ షుగర్ కూడా కాపాడుతుంది. డయాబెటిస్ తో బాధపడేవారు బ్లాక్ టీ తీసుకోవాలి. రక్తంలో ఇన్సూలిన్‌ మెరుగుపరుస్తుంది వాపు సమస్యను తగ్గిస్తుంది. బ్లాక్ టీ లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా గ్రహిస్తుంది. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.


ఇదీ చదవండి: ఖాళీ కడుపున వాము టీ తీసుకుంటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?


చమామిలే టీ..
చమామిలే టీ మంచి హెర్బల్ టీ ఇందులో కేఫైన్ ఉండదు. మన శరీరానికి ఎంతో ఆరోగ్య కరం ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదే. చమామిలే టీ తాగడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది.  ఇన్సూలిన్‌ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. చమామిలే టీ పడుకునే సమయంలో తీసుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుంది.


మందార టీ..
మందార టీ లో పాలిఫెనల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఆర్గానిక్ ఆసిడ్స్ ఉంటాయి. మందార టీ షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అంతేకాదు కొలెస్ట్రాల స్థాయిలు కూడా తగ్గిపోతాయి. దీంతో బరువు ఈజీగా తగ్గుతారు.


ఇదీ చదవండి: ప్రతిరోజు ఒక గంట నడిస్తే చాలు 6 ప్రయోజనాలు పొందుతారు..


పసుపు టీ..
పసుపుతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్సు డయాబెటిస్ సమస్యలు తగ్గుతాయి పసుపులో కర్కుమీన్ ఉంటుంది అని నివేదికలు తెలుపుతున్నాయి. పసుపు టీ తాగడం వల్ల కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది పసుపు డయాబెటిస్ వారికి మంచిది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి