Diet For Weight Loss: ప్రస్తుతం చాలా మంది వివిధ కారణాల వల్ల స్థూలకాయంతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల చిట్కాలను అనుసరించి చివరి ఫలితం మాత్రం పొందలేకపోతున్నారని ఇటివలే పలు నివేదికల్లో తేలింది. కొందరతై కష్టపడి వ్యాయామాలు కూడా చేస్తారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతారు. అయితే ఈ శరీర బరువును తగ్గించుకోవడానికి తప్పకుండా రాత్రి పడుకునే ముందు ఈ సులభమైన చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజూ అనుసరించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడమేకాకుండా.. సులభంగా అధిక బరువు నుంచి ఉపశమనం లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పడుకునే 2 గంటల ముందు ఈ ఆహారం తీసుకోండి:
బరువు తగ్గడానికి.. రాత్రిపూట పడుకునే 2 గంటల ముందు తేలికపాటి డిన్నర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.ఈ ఆహారాల్లో తప్పకుండా సులభంగా జీర్ణమయ్యే అహారాన్ని తీసుకుంటే శరీరానికి చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


తినడానికి ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి:
ఆహార రుచిని పెంచడానికి యాపిల్ సైడర్ వెనిగర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల శరీరం కూడా డిటాక్స్ ఉంటుంది. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గుతారు.



రాత్రి పూట మద్యం అస్సలు తీసుకోవద్దు:
ఆల్కహాల్‌లో అధికంగా కేలరీలు లభిస్తాయి. కాబట్టి నిద్రవేళకు ముందు ఆల్కహాల్ తీసుకుంటే సులభంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా వస్తాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకోవడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 



నిద్రపోయే ముందు ధ్యానం చేయండి:
అధిక బరువు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఒత్తిడిని, టెన్షన్ దూరంగా ఉండడం చాలా మంచిది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీటిని నియంత్రించుకునేందుకు ప్రతి రోజూ నిద్రపోయే ముందు ధ్యానం చేయండి.


వేడి నీటితో స్నానం చేయండి:
బరువు తగ్గడానికి మంచి నిద్ర చాలా ముఖ్యం కాబట్టి సులభంగా నిద్ర రావడానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తగ్గుతుంది. కాబట్టి ప్రతి రోజూ రాత్రి వేడి నీటితో స్నానం చేయండి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)a


Also Read: Director Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. నొప్పిని సైతం లెక్కచేయకుండా..  


Also Read: India vs Sri Lanka: రాజ్‌కోట్‌లో సూర్య సునామీ.. బౌలర్ల మెరుపులు.. శ్రీలంక చిత్తు  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook