Male Menopause: మహిళల జీవితంలో నెలసరి లేదా పీరియడ్స్ అనేది ఓ భాగం. ప్రతి మహిళకు ప్రతి నెలా ఇది తప్పదు. టీనేజ్ కంటే ముందు నుంచి ప్రౌఢ వయస్సు వరకూ ప్రతి నెలా నెలసరి ఎలా ఉంటుందో..నిర్ణీత వయస్సుకు వచ్చాక మెనోపాజ్ అంతే సహజం. మెనోపాజ్ వచ్చిందంటే ఇక రుతుచక్రం ఆగిపోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళల్లో మెనోపాజ్ వయస్సు 45-55 ఏళ్ల మధ్యలో ఉంటుందని అంచనా. ఒక్కో మహిళకు ఒక్కోలా ఉంటుంది. మహిళల్లో ఉండే హార్మోన్లు అయిపోవడంతో మెనోపాజ్ సంభవిస్తుంది. మెనోపాజ్ అనేది కేవలం మహిళల్లోనే ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఆశ్చర్యమేంటంటే పురుషుల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ సమస్య కాస్త విభిన్నంగా ఉంటుంది. పురుషుల్లో టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గిపోవడం లేదా అయిపోవడం జరుగుతుంది. 


పురుషుల్లో సంభవించే ఈ ప్రక్రియను ఆండ్రోపాజ్ అంటారు. టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. పురుషుల్లో 30 ఏళ్లు దాటాక టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గుతుంటాయి. వయస్సు ఒక్కటే కాకుండా ఒత్తిడి, మద్యం, మందుల సేవనం, ఇన్‌ఫెక్షన్ వంటివి కూడా పురుషుల మెనోపాజ్‌కు కారణం. పురుషుల్లో ఆండ్రోపాజ్ సంభవించినప్పుడు మూడ్ సంబంధిత లక్షణాలు ఎక్కువగా కన్పిస్తాయి. మూడ్ స్వింగ్ కావడం, డిప్రెషన్, ఆందోళన, ఎనర్జీ లోపించడం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, తలపోటు వంటివి కన్పిస్తాయి.


మరి కొన్ని లైంగిక లక్షణాలు కూడా ఉంటాయి. అంటే లైంగిక వాంఛ తగ్గడం, ఎరెక్షన్ సమస్య, త్వరగా ఎజాక్యులేషన్ కావడం, కండరాల బలహీనత, అలసటగా ఉండటం, ఎముకల్లో బలం లేకపోవడం, హాట్ ఫ్లషెస్ వంటి సమస్యలు కన్పిస్తాయి. మహిళల్లో మెనోపాజ్ సంభవిస్తే నెలసరి ఆగిపోతుంది. నిర్ణీత వయసు వచ్చాక ప్రతి మహిళ ఈ మెనోపాజ్ దశను దాటాల్సిందే. మెనోపాజ్ సంభవించిందంటే ఇక ఆ మహిళ తల్లి కాలేదని అర్ధం. పురుషుల్లో మెనోపాజ్ అంటే టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గుతాయి. 


పురుషుల్లో మెనోపాజ్ సమస్య సాధారణంగా 50 ఏళ్లకు సంభవిస్తుంది. ఈ సమయంలో పురుషులకు టెస్టోస్టిరోన్ స్థాయి 1 శాతం తగ్గుతుంది. పురుషుల్లో మెనోపాజ్ సమస్య వచ్చినప్పుడు అలసట, లైంగిక వాంఛ తగ్గడం, నిద్రలేమి, బరువు పెరగడం, కండరాల్లో బలహీనత, కేశాలు రాలిపోవడం, ఎముకల బలహీనత అనేవి మెనోపాజ్ లక్షణాలు.


పురుషుల్లో వయసుతో పాటు టెస్టోస్టిరోన్ లెవెల్ తగ్గుతుంది. టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిన తరువాత కొన్ని నెలల వరకూ అలసట ఎక్కువగా ఉంటుంది. చికాకు ఎక్కువగా ఉంటుంది. మూడ్ స్వింగ్ అవుతుంటుంది. చర్మం సైతం పల్చగా మారిపోతుంటుంది. 


Also read: Diabetes Tips: మధుమేహం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, సాధారణంగా కన్పించే లక్షణాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook