Health Benefits Of Mango Peel: మామిడి పండును ఇష్టపడనివారు ఉంటూ ఉండరు. అయితే  సాధారణంగా  మామిడి తొక్కును తొలగించి పండు తింటాము. కానీ ఆరోగ్య నిపుణులు ప్రకారం ఈ తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయని దీనిని వృథా చేయడం వల్ల మనకే నష్టం కలుగుతుందని చెబుతున్నారు. ఈ  మామిడి పండు తొక్కు భాగంలో చాలా పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామిడి తొక్కులో ఆరోగ్య ప్రయోజనాలు:


మామిడి పండులో బోలెడు పోషకాలు ఉంటాయని మన అందరికి తెలుసు. అయితే ఈ మామిడి పండు తొక్కలో కూడా పుష్కలమైన గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్‌ సి, ఎ, బి-6, ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా దొరుకుతాయి. ఈ తొక్కను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. 


ఆరోగ్య ప్రయోజనాలు:


మామిడి పండు తొక్కను తీసుకోవడం వల్ల మలబద్దం, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. ఇందులో అధికశాతం ఫైబర్‌ కంటెంట్‌ ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది కడుపులోని ప్రేగుల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు గుండె సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు  చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తొలగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే ఇందులోని విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. తరుచుగా వచ్చే జలుబు, ఫ్లూ, దగ్గు వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. 


మామిడి తొక్కులోని కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఎంతో మేలు చేస్తుంది ఇందులోని విటమిన్‌ ఎ చర్మంపై కలిగే మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. మామిడి తొక్కులోని కాల్షియం ఎముకలకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని ఆస్టియోపోరోసిస్‌ పెద్దలలో కలిగే ఎముకల వ్యాధులను నివారించడంలో మేలు చేస్తుంది. 


డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్నవారు కూడా ఈ మామిడి పండు తొక్కను తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటుంది. కానీ దీనిని తీసుకొనే ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించడంలో చాలా అవసరం. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పండును తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని వల్ల అధిక ఆకలి కోరికలు తగ్గుతాయి.  దీని వల్ల కడుపు నిండిన భావనకలుగుతుంది. సులువుగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. 


మామిడి తొక్కును ఎలా తినాలి:


* మామిడి తొక్కును పచ్చిగా తినవచ్చు.


* మామిడి తొక్కును వంటకాల్లో ఉడికించి వడ్డించవచ్చు.


* మామిడి తొక్కును సూప్‌లు, స్టూలు, కర్రీలకు రుచిని జోడించడానికి ఉపయోగించవచ్చు.


* మామిడి తొక్కుతో పచ్చడి, సాస్‌లు కూడా తయారు చేసుకోవచ్చు. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి