Dalia Easily Reduce the Body weight: శరీర బరువు తగ్గించుకోమని చాలా మంది సలహా ఇస్తుంటారు. ఇష్టమైన ఆహారాన్ని తినకుండా ఉంటూ బరువు తగ్గించొవటం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా! గోధుమ గింజలను గ్రైండ్ చేయటం ద్వారా వచ్చే దానిని 'దాలియా' లేదా 'గోధుమ రవ్వ' అంటారు. దాదాపు అందరికీ తేలిన వంటకమే మరియు ప్రతి ఒక్కరి ఇంట్లో సాధారణంగా ఉండే వంటకం ఇది. గోధుమ రవ్వ వలన


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలో దోహదపడుతుంది. ఇది అధిక మొత్తంలో ఫైబర్ లను మరియు విటమిన్ 'B' లను కలిగి ఉంటుంది. గోధుమ రవ్వ తినే మహిళలతో పోలిస్తే తినని మహిళల శరీర బరువు ఎక్కువగా ఉంటుందని 'హార్వర్డ్ మెడికల్ స్కూల్' వారు జరిపిన పరిశోధనల్లో నిరూపించబడింది 


Also Read: Anasuya Fires on Kota: హీరోలు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న ఎందుకు అడగరు..? కోటకు స్ట్రాంగ్ కౌంటర్


తక్కువ క్యాలోరీలు
గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గించుటకు గానూ, వీటిలో అధిక మొత్తంలో పోషకాలతో పాటుగా, తక్కువ క్యాలోరీలను కలిగి ఉంటాయి. రోజు గోధుమ రవ్వను తినటం వలన మీ శరీరానికి తక్కువ క్యాలోరీలను అందించిన వారవుతారు. అంతేకాకుండా, మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటంలో సఫలం అవుతారు. 


అధిక మొత్తంలో ఫైబర్
గోధుమ రవ్వ అధిక మొత్తంలో ఫైబర్ స్థాయిలను కలిగి ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ లు జీర్ణవ్యవస్థను సజావుగా జరపటమే కాకుండా, శరీర భాగాల అన్ని విదులను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించేలా ప్రోత్సహించి పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, మీరు తీసుకునే ఆహారంలో ఉండే ఫైబర్ చక్కెరలుగా మార్చబడవు. కావున, మీరు రోజు పాటించే ఆహార ప్రణాళికలో గోధుమ రవ్వను కలుపుకోవటం వలన శరీర బరువు తగ్గటంతో పాటుగా మంచి ఫలితాలను పొందుతారు.


Also Read: Viral Video: అనుమానం పెనుభూతం.. భర్తపై అనుమానంతో జిమ్‌లో మహిళను ఇరక్కొట్టిన భార్య


నెమ్మదిగా ప్రక్రియలు
శరీర జీవక్రియ వేగంగా జరగటం వలన క్యాలోరీలు ఎక్కువగా ఖర్చు చేయబడి, శరీర బరువు తగ్గుతుందని ఒక అపనమ్మకం ప్రచారంలో ఉంది. కానీ, వేగంగా జీవక్రియ జరగటం వలన త్వరగా ఆకలి వేస్తుంది ఫలితంగా, అధిక క్యాలోరీలను తీసుకునే అవకాశం ఉంది. ఫలితంగా, శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వ కూడా అధికం అవుతుంది. గోధుమ రవ్వ తినటం వలన, ఇవి నెమ్మదిగా విచ్చిన్నం చెంది, జీర్ణాశయంలో నెమ్మదిగా శోషించబడటం వలన ఎక్కువ సమయం ఆకలి అవదు మరియు అధిక ఆహార సేకరణ వైపు మొగ్గు చూపరు.


అధిక స్థాయిలో ప్రోటీన్ 
గోధుమ రవ్వ అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉంటుంది. శరీర బరువు తగ్గాలి అనుకునే వారు దీనిని తప్పక తినాలి ఎందుకంటే, వీటిలో ప్రోటీన్ మరియు కొవ్వు పదార్థాలు అస్సలుండవు. కొవ్వు పదార్థాలు లేని ఆహార పదార్థాలను రోజు తినటం వలన శరీర బరువు సులభంగా తగ్గుతుంది.


Also Read: Viral Video:రన్నింగ్ రైలు నుండి దిగబోతూ కిందపడబోయిన గర్భిణీ.. కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్


పొట్ట నిండినట్టుగా అనిపించేలా
గోధుమ రవ్వ అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉంటుంది కావున, జీర్ణాశయంలో గ్రహించబడటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను తినటం వలన త్వరగా ఆకలిగా అనిపిస్తుంది. కానీ, కొద్ది మొత్తంలో తినే గోధుమ రవ్వ చాలా సమయం పాటు ఆకలిగా అవకుండా చూస్తుంది.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి