Experts on Earwax Removal: మనలో చాలామందికి చీటికి మాటికి కాటన్ ఇయర్ బడ్స్‌ను చెవిలో పెట్టి క్లీన్ చేసుకునే అలవాటు ఉంటుంది. కనీసం వారానికి ఒకసారైనా చాలామంది ఇలా కాటన్ ఇయర్ బడ్స్‌తో చెవులను క్లీన్ చేసుకుంటుంటారు. అయితే ఇది మంచిదేనా... ఇలా ఇయర్ బడ్స్‌తో చెవులను క్లీన్ చేసుకోవడంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెవులను ఇయర్ బడ్స్‌తో క్లీన్ చేయాల్సిన అవసరం లేదు : మన చెవిలో పేరుకుపోయే గులిమి లేదా జివిలిని ఆటోమేటిగ్గా క్లీన్ చేసుకునే వ్యవస్థ డీఎన్ఏలోనే నిక్షిప్తమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఇయర్ బడ్స్‌తో మనం చెవులను శుభ్రం చేసుకోవాల్సిన పని లేదు. మన చెవి ఎప్పటికప్పుడు ఇయర్ వ్యాక్స్‌ను (గులిమి) విడుదల చేస్తూనే ఉంటుంది. ఇది మన ఇయర్ కెనాల్స్‌ని రక్షిస్తుంది. ఇది సహజంగానే లోపలి నుంచి బయటకు వచ్చేస్తుంటుంది. స్నానం చేసినప్పుడు ఆటోమేటిగ్గా శుభ్రమవుతుంది. కొన్నిసార్లు పెద్దవాళ్లలో ఇయర్ వ్యాక్స్ ఎండిపోయి గట్టిగా మారి ఇబ్బంది పెట్టవచ్చు. అప్పుడు మాత్రం వైద్యుడిని సంప్రదించాల్సిందే.


ఇయర్ బడ్స్‌తో చెవులను క్లీన్ చేయడం హానికరం :  చెవుల్లో కాటన్ ఇయర్ బడ్స్‌ను దూర్చి క్లీన్ చేయడం ద్వారా ఇయర్ కెనాల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇయర్ వ్యాక్స్ మరింత లోపలికి వెళ్లి.. అది గట్టిగా మారితే శుభ్రపరచడం కష్టమవుతుందని చెబుతున్నారు.  ఇలాంటి చర్యలు చెవిపోటు లేదా చెవికి సంబంధించిన ఇతర ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చునని అంటున్నారు. ఇయర్ బడ్స్‌తో చెవులను క్లీన్ చేయడం ద్వారా ఫలితమేమీ ఉండదని.. దానివల్ల నష్టమే ఎక్కువని అంటున్నారు. 


ఇయర్ వ్యాక్స్ సహజమే.. : ఇయర్ వ్యాక్స్‌ను మెడికల్‌గా సెరుమెన్‌గా పిలుస్తారు. ఇది నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తారు. దీనివల్ల చెవి ఎండిపోదు. చెవి లోపలికి దుమ్ము, ధూళి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అలాగే బాక్టీరియా, ఫంగస్ వంటి వాటిని లోపలికి చేరనివ్వదు. ఇయర్ వ్యాక్స్ విడుదల ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు. కొంతమందిలో తక్కువగా ఉండొచ్చు. ఏదేమైనా ఇది సహజమేనని గుర్తుంచుకోవాలి. 
 


Also Read: Rohit Sharma Trolls: రోహిత్.. ఓ కెప్టెన్ అయుండి అలానేనా చేసేది! ధోనీని చూసి నేర్చుకో!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook