Joint Pain Relief: శీతాకాలంలో వచ్చే కీళ్ల నొప్పులు తగ్గడానికి ఈ 2 ఆకుల రసాలు తాగితే చాలు..
Joint Pain Relief: శీతాకాలం ప్రారంభమైందంటే చాలు చాలామందిలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆధునిక జీవన శైలి కారణంగా వచ్చే కీళ్ల నొప్పులు కూడా రెట్టింపు అవుతాయి. అయితే ఇలాంటి సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Joint Pain Relief: ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా శీతాకాలం ప్రారంభమైంది. దీని కారణంగా వాతావరణంలో తేమ ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఎముకల సమస్యలు, కీళ్ల నొప్పులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
చాలామంది కీళ్ల నొప్పులు జీవనశైలి కారణంగా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలి పాటించే వారిలో కీళ్ల నొప్పులు చాలా తొందరగా వస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యువతను ఈ నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడమేనని వారంటున్నారు. చలికాలంలో యువతలో కూడా ఈ కీళ్ల నొప్పుల తీవ్రత రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు కీళ్లనొప్పులు వస్తాయి. కీళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంది. యాసిడ్ కీళ్ల ఎముకలలోకి చొచ్చుకుపోవడంతో, స్ఫటికాకార నిర్మాణాలు ఏర్పడతాయి. ఎముకలు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల నొప్పులు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లో వైద్యులను సంప్రదించి సకాలంలో చికిత్స పొందడం చాలా మంచిది. తరచుగా కీళ్లనొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు మందులను వినియోగించాల్సి ఉంటుంది. అయితే సాధారణ చిట్కాలతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పుదీనా ఆకులు:
పుదీనా ఆకులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, ఫోలేట్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల వాపును తగ్గించేందుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు రెండుసార్లు పుదీనా ఆకులతో తయారుచేసిన రసాన్ని తాగాల్సి ఉంటుంది.
కొత్తిమీర ఆకులు:
కొత్తిమీర ఆకుల్లో కూడా అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ఇందులో కాల్షియం, పొటాషియం, థయామిన్, ఫాస్పరస్, విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆకులతో తయారుచేసిన రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి అంతేకాకుండా యూరిక్ యాసిడ్ కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.