Drumstick Benefits: మధుమేహం నుంచి స్పెర్మ్‌కౌంట్, లైంగిక సామర్ధ్యం వరకూ అన్నింటికీ అద్భుత ఔషధమిదే
Drumstick Benefits: ములగ చెట్టులో ప్రతీది ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిందే. డయాబెటిస్ నుంచి మేల్ ఇన్‌ఫెర్టిలిటీ వరకూ అన్ని సమస్యలకు సమాధానముంది ములగతో. ఆ వివరాలు మీ కోసం.
ములగ చెట్టు గురించి తెలుగు ప్రజలకు బాగా తెలుసు. తెలుగునేలపై విరివిగా పండుతుంది. ములగ చెట్టు ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ములగచెట్టులో ప్రతి భాగం ఉపయోగకరమైందే. ములగతో కలిగే ప్రయజనాల గురించి తెలుసుకుందాం..
ఆధునిక జీవన విధానంలో ప్రపంచమంతా మేల్ ఇన్‌ఫెర్టిలిటీ ప్రధాన సమస్యగా మారుతోంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, స్థూలకాయం,డయాబెటిస్, ఒత్తిడి వంటివి కూడా సహజంగా కన్పిస్తున్నాయి. మనిషిలో ఎదురయ్యే ఒత్తిడి క్రమక్రమంగా మానసిక వ్యాధికి కారణం కావచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే..ములగ కూర చాలా మంచి ఫలితాలనిస్తుంది. ములగాకులతో తీవ్రమైన వ్యాధుల్నించి కూడా ఉపశమనం పొందవచ్చు.
ఆరోగ్య నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం ములగ ఆకుల్ని ఉడికించి తాగితే చాలా రకాలైన వ్యాధులు దూరమౌతాయి. కొలెస్ట్రాల్, బీపీ నియంత్రించేందుకు దోహదపడుతుంది. నాళికల బ్లాకేజ్‌ను కూడా అరికడుతుంది.
మగవారిలో స్పెర్మ్‌కౌంట్ తక్కువగా ఉండటం లేదా స్పెర్మ్ క్వాలిటీ లేకపోవడం వంటి సమస్యలకు ములగ ఆకులు, ములగ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. ములక్కాయ కూర తినడం వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయి. టెస్టోస్టిరోన్ హార్మోన్ పెరుగుతుంది.
చాలామంది తమ దైనందిక పని లేదా వ్యక్తిగత జీవితం విషయంలో ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది క్రమంగా మానసిక సమస్యగా మారుతుంది. ములగ ఆకులు హార్మోన్ సమతుల్యతను కాపాడుతాయి. మూడ్ సెట్ చేస్తాయి.
ములగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఫలితంగా ఫ్రీ రాడికల్స్, హానికారక విష పదార్ధాల్ని నిర్మూలన జరుగుతుంది. ములగ ఆకులు కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధిని సైతం తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
Also read: Eggs Side Effects: ఆ సమస్యలు ఉన్నవాళ్లు గుడ్లు పొరపాటున కూడా తినకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook