Dry Fruits Side Effects: ఆ మూడు సమస్యలున్నవాళ్లు..పొరపాటున కూడా నట్స్ తినకూడదు
Dry Fruits Side Effects: నట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అవసరం. కానీ కొన్ని సమస్యలున్నవాళ్లు..నట్స్ తినకూడదంటున్నారు వైద్య నిపుణులు ఆ వివరాలు మీ కోసం...
Dry Fruits Side Effects: నట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అవసరం. కానీ కొన్ని సమస్యలున్నవాళ్లు..నట్స్ తినకూడదంటున్నారు వైద్య నిపుణులు ఆ వివరాలు మీ కోసం...
సాధారణంగా డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టపడని వారూ ఉండరు. అదే సమయంలో డ్రై ఫ్రూట్స్ తినకూడదని చెప్పే వైద్యుడూ ఉండడు. ఎందుకంటే శరీరానికి, ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ అనేవి అంత అవసరం. ఇందులో ఉండే పోషకాలు వివిధ సమస్యల్ని దూరం చేస్తాయి. కానీ కొన్ని సమస్యలకు మాత్రం డ్రై ఫ్రూట్స్ తినకూడదని చెబుతున్నారు వైద్యులు. ఏయే సమస్యలకు డ్రైఫ్రూట్స్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
అజీర్ణ సమస్య ఉన్నవాళ్లు నట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ తినకూడదు. ఎందుకంటే నట్స్‌లో ఉండే ఫ్యాట్, ఫైబర్ కారణంగా అజీర్తి సమస్యలతో ఇబ్బంది పడేవారికి సమస్యగా మారుతుంది.
ఛాతీలో మంట, ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య ఉన్నవాళ్లు కూడా నట్స్ తినకూడదు. నట్స్‌లో ఉండే ఫ్యాట్స్ సమస్యను మరింత జటిలం చేస్తాయి. అందుకే ఛాతీలో మంట, పుల్లటి తేన్పుల సమస్యతో బాధపడేవారు పొరపాటున కూడా డ్రై ఫ్రూట్స్ తినకూడదు. ఈ సమస్య ఉన్నవాళ్లు మరీ ముఖ్యంగా బాదంను దూరంగా పెట్టాలి. ఎందుకంటే బాదంతో గ్యాస్ట్రైటిస్ సమస్య పెరిగే అవకాశాలున్నాయి.
అదే విధంగా ఎలర్జీ సమస్య ఉన్నవాళ్లు ముఖ్యంగా నట్స్ ఎలర్జీ ఉన్నవాళ్లు తినకూడదు. బాదం, వాల్‌నట్, జీడిపప్పు తింటే ఎలర్జీ వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటివారు నట్స్ తినడం వల్ల చర్మపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు రావచ్చు. కడుపులో గ్యాస్, ఎసిడిటీ సమస్య ఉన్నప్పుడు బాదం తింటే ఆ సమస్య మరింత అధికమౌతుంది. అందుకే వివిధ అనారోగ్య సమస్యలున్నవాళ్లు వైద్యుడి సలహా మేరకే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది.
Also read: Ladies Finger Benefits: ఆ ఒక్క కూరగాయ తింటే చాలు..మీ కంటి సమస్యలు దూరం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook