Side Effects Of Mayonnaise: మయోనీస్ అనేది చాలా ప్రాచుర్యం పొందిన ఎముల్షన్. ఇది సాధారణంగా సలాడ్‌లు, సాండ్‌విచ్‌లు ఇతర వంటకాలకు రుచిని, క్రీమీ టెక్స్చర్‌ని అందిస్తుంది. ఇది గుడ్డు పచ్చసొన, నూనె, వెల్లుల్లి, నిమ్మరసం, ఇతర సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. మయోనీస్‌ను ఎక్కువగా చికెన్‌ డిష్‌లతో తింటారు. పిల్లలు, పెద్దలు దీని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఆరోగ్యనిపుణులు ప్రకారం దీని తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని చెబుతున్నారు. మయోనీస్‌  వల్ల కలిగే నష్టలు ఏంటో మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మయోనీస్‌ క్రీమీ టెక్స్చర్‌ని కలిగి ఉంటుంది. ఇందులో గుడ్డును ఉపయోగించడం వల్ల విటమిన్‌ ఇ ఉంటుంది. దీని బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే దీని అతిగా తినడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ఇందులో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల అధిక బరువు పెరిగే అవకాశులు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొన్ని రకాల మయోనీస్లు ప్రాసెస్‌ చేసిన ఆహారాలతో తయారు చేస్తారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మరి కొన్ని మయోనీస్‌లో షుగర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచి డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉంటుంది. దీని ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అధిక మయోనీస్‌ వినియోగం కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది, వీటిలో అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్‌లు, మూత్రపిండాల సమస్యలు ఉన్నాయి.


మయోనీస్ బదులుగా ఏం తినవచ్చు?


మీరు మయోనీస్ తీసుకోవడం తగ్గించాలనుకుంటే, ఈ కింది ఆహారాలను ప్రయత్నించవచ్చు అందులో ఒకటి ఆవాల నూనె. ఇది సలాడ్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యకరమైనది. గ్రీక్ యోగర్ట్‌ మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉండే సాస్‌. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని సలాడ్ డ్రెస్సింగ్‌గా ఉపయోగించవచ్చు. అవకాడోను మాషీ చేసి సాండ్‌విచ్‌లలో లేదా టాకోస్‌లో మయోనీస్‌కు బదులుగా ఉపయోగించవచ్చు. హమ్ముస్ అనేది చిక్కనైన బీన్ డిప్, ఇది సాండ్‌విచ్‌లు, వెజిటబుల్ స్టిక్‌లతో బాగా సరిపోతుంది.


మయోనీస్‌ బదులుగా ఇలా ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే పోషకరమైన పదార్థాలు తినడం చాలా మంచిది. కాబట్టి మయోనీస్‌ తినడం మంచిది కాదు.


గమనిక: మీ ఆరోగ్య పరిస్థితులు ఆహార అలవాట్ల ఆధారంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Also Read: Belly Fat: సెలెరీ టీని ఎప్పుడైనా ట్రై చేశారా? బెల్లీ ఫ్యాట్‌ తగ్గించే సూపర్‌ టీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook