Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు
మనం రోజుకి ఎంత మోతాదులో ఉప్పుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ( How much salt is enough salt ). ఎక్కువ ఉప్పు తినడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజుకి ఎంత మోతాదులో ఉప్పుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ( How much salt is enough salt ). ఎక్కువ ఉప్పు తినడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఏ వంటకంలోనైనా ఉప్పు కొద్దిగా అటు ఇటుగా ఐతే.. ఆ వంటకం రుచే మారిపోతుంది. ఏ వంటకానికైనా కేవలం ఒక్క చిటికెడుతో రుచిని తీసుకొచ్చే శక్తి ఉప్పుకి కలదు. అందుకే " అన్ని వేసి చూడు.. నన్ను వేసి చూడు" అనే నానుడి ఊరికే రాలేదు అని చెబుతుంటారు మన పెద్దలు. Also read: మీ ప్యాకెట్ పాలు Coronavirus నుండి సురక్షితమేనా ?
ఐతే ఉప్పుని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల రక్తపోటుపై ప్రభావం చూపిస్తుందనే విషయం మీకు తెలుసా అంటున్నారు వైద్య నిపుణులు. అలా అని, ఉప్పును పూర్తిగా మానేయడం వల్ల కూడా ప్రమాదమే. అందుకే ఒక రోజుకి ఉప్పు ఎంత మోతాదులో తీసుకోవాలి ? ఇది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ? ఆరోగ్య నిపుణులు సలహలు ( Health experts on salt intake ) ఎంటో ఇప్పుడు మనం చూద్దాం. Also read: How to check BP: హై బీపీకి చెక్ పెట్టే ఫుడ్స్ ఇవే
ఉప్పు అనేది ప్రతీ ఒకరి వంటింటిలో ఉండే నిత్యావసర వస్తువు. మనం తినే ప్రతీ ఆహారంలో కూడా ఉప్పు సహజంగానే ఉంటుంది. ఉప్పు లేనిదే ఏ వంట కూడా రుచిగా ఉండదు. అంతేకాకుండా, కూరగాయలు, ఆకుకూరలను ఉప్పు వేసి కడగడం వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయి. మానవ శరీరం పనిచేయడానికి సోడియం ఒక ముఖ్యమైన ఖనిజం. శరీరానికి ఆ సోడియంను అందించేది ఉప్పే. ఉప్పులోని సోడియం నరాల ప్రేరణ, రక్త ప్రసరణ, కండరాల సంకోచం, ఖనిజాల సమతుల్యతను కాపాడుతుంది. Also read: Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం
అధిక మోతాదులో ఉప్పు తీసుకుంటే వచ్చే సమస్య ఏంటి ?
అధిక మొత్తంలో తీసుకునే ఉప్పు గుండె జబ్బులు ( Heart diseases), అధిక రక్తపోటు ( High BP), హార్ట్ స్ట్రోక్( Heart stroke ), మూత్రపిండాలు వ్యాధుల ( Kidney diseases ) బారినపడే ప్రమాదాన్ని పెంచుతుంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) రోజుకి 2 గ్రాముల సోడియం తీసుకోవాలని సిఫారసు చేస్తుంది. అంటే రోజుకు 5 గ్రాముల ఉప్పు లేదా ఒక టీస్పూన్ అన్నమాట. సోడియం అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అది శరీరంలో కరిగిపోవడనికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. ఆ క్రమంలోని శరీరంలోని కణాల నుంచి ఆ నీటిని సోడియం బయటకు లాగేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్ ( Dehydration ) బారినపడే ప్రమాదం ఉంది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి.. ఆహారంలో ఉప్పు మోతాదు ఎక్కువైనప్పుడు తిన్న తర్వాత బాగా దాహమేస్తుంది. ఒక్కోసారి శరీరానికి అవసరానికి మించి నీరు తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం ఏర్పడుతుంది. అంతేకాక, ఒంట్లో ఉన్న అధిక సోడియంను కరిగించడనికి మూత్రపిండాలు మూత్ర విసర్జన ఆపేస్తాయి. రక్తంలో అధిక సోడియం వల్ల ధమనుల ఒత్తిడిని పెరుగుతుంది. ఇది అరోటా, రక్త నాళాలు వంటి ధమనులు గట్టిపడటానికి దారితీస్తుంది. Also read: Health tips: వేపాకుతో ఇన్ని లాభాలు, ప్రయోజనాలా ?
ఆహారంలో ఉప్పు ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. లేదంటే శరీరంలో కలిగే మార్పులతో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ( Health issues ) తప్పవు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు