Home Remedies For Hair Fall: ఈ మూలికలను వాడితే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది!!
Ayurvedic Herbs To Reduce Hair Fall: ఆధునిక కాలంలో మారిన జీవనశైలి కారణంగా అనేక సమస్యల బారిన పడుతున్నారు. అందులో ముఖ్యంగా జుట్టు రాలే సమస్య ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆయుర్వేద మూలికలను ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
Ayurvedic Herbs To Reduce Hair Fall: జుట్టు రాలడం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అందులో ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక ఒత్తిడి జుట్టు రాలడానికి ప్రధాన కారణం. థైరాయిడ్, PCOS వంటి హార్మోన్ల సమస్యలు జుట్టు రాలడాన్ని ప్రేరేపిస్తాయి. కొన్ని రకాల మందులు జుట్టు రాలడాన్ని సైడ్ ఎఫెక్ట్‌గా కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలడం జన్యుపరంగా వస్తుంది. తల చర్మంపై వచ్చే ఇన్‌ఫెక్షన్లు, సోరియాసిస్ వంటి వ్యాధులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. బిగుతుగా కేశాలంకరణ చేయడం, రసాయనాలను ఎక్కువగా వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అయితే, ఆయుర్వేదం ఈ సమస్యకు సహజమైన పరిష్కారాలను అందిస్తుంది.
ఆయుర్వేదంలో చాలా మూలికలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. బయట లభించే ప్రొడెక్ట్స్ కంటే ఇందులో ఉండే సహాజమైన లక్షణాలు జుట్టు పెరుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. అయితే ఎలాంటి మూలికలను ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం.
జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఆయుర్వేద మూలికలు:
బ్రహ్మి:
బ్రహ్మి మెదడుకు మాత్రమే కాదు, జుట్టుకు కూడా చాలా మంచిది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టును బలంగా చేస్తుంది.
అశ్వగంధ:
అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడానికి, నిద్రను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును మృదువుగా చేస్తుంది. బలమైన జుట్టు మీసొంతం అవుతుంది.
వేపా ఆకులు:
వేపా ఆకులులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంది. ఇది తల చర్మం సమస్యలను నియంత్రిస్తుంది, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. చుండ్రు, జిడ్డు వంటి సమస్యలు తగ్గుతాయి.
ఆముదం:
ఆముదం జుట్టుకు చాలా పోషణ ఇస్తుంది. ఇది జుట్టును బలంగా చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడుతుంది.
ఈ మూలికలను ఎలా ఉపయోగించాలి:
హెయిర్ ఆయిల్: ఈ మూలికలతో తయారు చేసిన హెయిర్ ఆయిల్‌ను తలకు మర్దన చేస్తే జుట్టు పెరుగుదలకు చాలా మంచిది.
హెయిర్ ప్యాక్: ఈ మూలికల పొడిని దంచిన తర్వాత దానిని నీటితో కలిపి పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి.
హెర్బల్ షాంపూ: ఈ మూలికలతో తయారు చేసిన హెర్బల్ షాంపూలను ఉపయోగించడం మంచిది.
గమనిక: ఏదైనా కొత్త మూలికలను, హెయిర్ ప్రొడెక్ట్స్‌ను ఉపయోగించే ముందు వైద్యుల సలహాను తీసుకోవడం మంచిది.
Also read: Black Salt: వేడి నీళ్లలో దీన్ని కలుపుకుని తాగితే నిమిషాల్లో బ్లడ్ షుగర్ నార్మల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter