Egg For Weight Loss: అవును ఇది అస్సలు నమ్మరు.. గుడ్లను ఆహారంలో తీసుకున్న బరువు తగ్గుతారు..
Egg For Weight Loss: గుడ్లు ప్రోటీన్ మూలం. ఇందులో శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రోటిన్లు లభిస్తాయి. అంతేకాకుండా బరువును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి గుడ్డును కూడా వినియోగించాలి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం దృఢంగా కూడా మారుతుంది.
Egg For Weight Loss: ప్రస్తుతం చాలామంది వివిధ కారణాలవల్ల బరువు విచ్చలవిడిగా పెరుగుతున్నారు. అయితే పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలామంది కఠినతర వ్యాయామాలు, వివిధ రకాల డైట్లను పాటిస్తున్నారు. అయితే వీటి వల్ల కాకుండా రోజు తీసుకునే కోడిగుడ్డు ద్వారా కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గుడ్లలో ప్రోటీన్ క్యాలరీలు అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు అని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం కూడా దృఢంగా మారుతుందని అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
వీటి పరిమాణాలు అధికంగా ఉంటాయి:
గుడ్లలో ఖనిజాలు విటమిన్ లు పోషకాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని ఉదయం పూట తీసుకోవడం వల్ల రోజంతా శరీరం యాక్టివ్ గా ఉండేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే బరువు తగ్గడానికి వీటిని మనం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచి స్తున్నారు. గుడ్ల లో ఉండే తెల్ల సోన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాలను తగ్గించి బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది.
ఈ రెసిపీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
చాలామంది నల్ల మిరియాలను వంటకాల రుచిని పెంచేందుకు వినియోగిస్తారు. ఈ మిరియాల్లో ఉండే ఆరోమా వంటల రుచిని పెంచడమే కాకుండా జీర్ణ క్రియ సమస్యలను దూరం చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే సులభంగా బరువు తగ్గడానికి కోడిగుడ్డు తెల్ల సోనతో ఆమ్లెట్ వేసుకొని దాని పైనుంచి మిరియాల పొడిని వేసుకుని ఉదయం పూట ఆహారంగా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.
Also Read : Kantara Telugu Movie Collections : ఒక్క రోజులోనే బ్రేక్ ఈవెన్.. ఫస్ట్ డే ఎంతంటే?
Also Read : Salaar Update : పృథ్వీరాజ్ భయంకరమైన లుక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook