Vardharaja Mannaar : సలార్ అప్డేట్ అదిరింది.. పృథ్వీరాజ్ భయంకరమైన లుక్

Prithviraj Sukumaran As Vardharaja Mannaar పృథ్వీరాజ్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా సలర్ మూవీలో ఆయన చేస్తోన్న వరదరాజా మన్నార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2022, 10:44 AM IST
  • పృథ్వీరాజ్ సుకుమార్ బర్త్ డే
  • సలార్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్
  • వరదరాజా మన్నార్ పాత్ర కేరళ సూపర్ స్టార్
Vardharaja Mannaar : సలార్ అప్డేట్ అదిరింది.. పృథ్వీరాజ్ భయంకరమైన లుక్

Prithviraj Sukumaran As Vardharaja Mannaar : ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా సలార్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి పవర్ ఫుల్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. కేరళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ ఈ సినిమాలో వరదరాజా మన్నార్ పాత్రలో కనిపించబోతోన్నాడు. కేజీయఫ్‌లో అధీరాను మించేలా ఈ పాత్ర ఉంటుందని అర్థమవుతోంది. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదలచేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.

 

మామూలుగా అయితే పృథ్వీరాజ్ ఈ చిత్రంలో నటించేందుకు టైం దొరకడం లేదని చెప్పాడు. ఈ సలార్ కథను తనకు రెండు మూడేళ్ల క్రితమే చెప్పాడని, అప్పుడే ఈ సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యానని తెలిపాడు.అయితే మధ్యలో కరోనా రావడం, తన సినిమాలు మళ్లీ డేట్స్ మారడంతో అది కుదరదేమో అని అనుకున్నాడట. అయితే సలార్ సినిమా కూడా ఆలస్యమవుతూనే వచ్చింది. దీంతో మళ్లీ డేట్స్ దొరికే చాన్స్ ఉందంటూ ఆ మధ్య చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్.

మొత్తానికి సలార్ సినిమాకు ఆయన డేట్లు కేటాయించేశాడు. షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన బర్త్ డే స్పెషల్ అంటూ సలార్ టీం సర్ ప్రైజ్ ఇచ్చింది. వరదరాజా మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ కనిపించబోతోన్నాడు. చూస్తుంటే అతనిలో విలన్ షేడ్స్ కనిపిస్తున్నాయి. కేజీయఫ్ అధీరా లాంటి పాత్రలో పృథ్వీరాజ్ కనిపిస్తున్నట్టోంది. మొత్తానికి ఈ పోస్టర్‌తో ఒక్కసారిగా సలార్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

అసలే పృథ్వీరాజ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు దర్శకుడిగా, ఇంకో వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా ఇలా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. చిరు సైరా కోసం గానీ, గాడ్ ఫాదర్ కోసం టైం కేటాయించలేకపోయిన పృథ్వీరాజ్.. సలార్ కోసం మాత్రం డేట్లు అడ్జస్ట్ చేసేశాడు.

Also Read : Salaar Update : పృథ్వీరాజ్ భయంకరమైన లుక్

Also Read : Ashu Reddy Tattoo : లోదుస్తులు లేకుండా.. ప్యాంట్ వేసుకోకుండా.. అషూ రెడ్డి అందాల ఆరబోత పీక్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News