Eggs 5 Health Benefits in summer: సాధాణంగా గుడ్లంటే అందరికీ ఇష్టం. ఆరోగ్య నిపుణులు సైతం గుడ్లను తినమని సూచిస్తారు. గుడ్లలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. వీటితో రకరకాల వంటకాలు కూడా తయారు చేసుకుంటారు. గుడ్లతో స్క్రాంబుల్, ఎంతో ప్రసిద్ధి చెందిన ఆమ్లెట్‌, గుడ్డు పులుసు ఇలా రకరకాల వెరైటీలను వండుకోవచ్చు. గుడ్డుతో బిర్యానీ కూడా తయారు చేసుకుంటారు. అయితే, ఎండకాలం ప్రత్యేకంగా గుడ్లను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల 5 ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రొటీన్..
గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల అభివృద్ధికి ఎంతో అవసరం. ప్రొటీన్‌ కండరాల బలానికి, అభివృద్ధికి ఎంతో అవసరం. అంతేకాదు గుడ్డు ఎక్కువ సమయంపాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. 


కంటి ఆరోగ్యం..
ఎండకాలం కంటి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కంటిపై ఒత్తిడిని కలిగిస్తుంది. గుడ్డులో లుటీన్, జియాంథిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంది మన కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం. అంతేకాదు హానికర సూర్యుని కిరణాల నుంచి మన కళ్లని కాపాడతాయి. అందుకే ఎండకాలం తప్పకుండా మన డైట్లో గుడ్లను చేర్చుకోవాలి.


ఇదీ చదవండి: వేసవి వేడి నుంచి ఈ 4 మూలికలు మీ పిల్లల్ని కాపాడతాయి.. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి..


గుండె ఆరోగ్యం..
గుడ్లను డైట్లో చేర్చుకోవడం వల్ల ఈ ఎండకాలం గుండెకు కూడా మేలు చేస్తుంది. ఇందులో మోనోసాచురేటెడ్‌, పాలీఅన్‌సాచురేటెడ్‌ అనే అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇది కార్డియోవాస్క్యూలర్‌ సమస్యలు రాకుండా మన గుండెను కాపాడుతుంది.


ఎముక ఆరోగ్యం..
గుడ్లలో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. గుడ్లలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. బలంగా, దృఢమైన ఎముకలకు గుడ్లు తీసుకోవాలి. ఇవి కండరాలు, ఎముకలను బలపరుస్తాయి. బోన్‌ ఫ్రాక్చర్‌ కాకుండా ఒస్టీయోపోరోసిస్‌ బారిన పడకుండా కాపాడుతుంది. త్వరగా ఎముకలు విరగకుండా కాపాడుతుంది.


ఇదీ చదవండి: ఈ 5 కొలెస్ట్రాల్‌ను సహజంగా.. ఎఫెక్టివ్‌గా బర్న్‌ చేసే మార్నింగ్‌ డ్రింక్స్.. 


బరువు నిర్వహణ..
ముఖ్యంగా గుడ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి.  అంతేకాదు గుడ్లలో ప్రోటీన్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. అతిగా తినాలనే కోరిక కలగకుండా ఉంటుంది. దీంతో బరువు కూడా పెరగరు. ఎండకాలం అతిగా ఆకలి కూడా అవుతుంది.  డైట్లో గుడ్లను చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter