5 Morning Drinks To Lower Cholesterol: ఈ 5 కొలెస్ట్రాల్‌ను సహజంగా.. ఎఫెక్టివ్‌గా బర్న్‌ చేసే మార్నింగ్‌ డ్రింక్స్.. 

5 Morning Drinks To Lower Cholesterol: గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుకోవాలి. ఇవి విటమిన్ డీ, హార్మోన్ల ఉత్పత్తికి కూడా సహాయపడతాయి.

Written by - Renuka Godugu | Last Updated : May 4, 2024, 02:20 PM IST
5 Morning Drinks To Lower Cholesterol: ఈ 5 కొలెస్ట్రాల్‌ను సహజంగా.. ఎఫెక్టివ్‌గా బర్న్‌ చేసే మార్నింగ్‌ డ్రింక్స్.. 

5 Morning Drinks To Lower Cholesterol: గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుకోవాలి. ఇవి విటమిన్ డీ, హార్మోన్ల ఉత్పత్తికి కూడా సహాయపడతాయి. కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటే ప్రాణాంతక గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఉదయం పరగడుపున ఈ డ్రింక్స్ తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయట.

గ్రీన్‌ టీ..
ప్రాణాంతక చెడు కొలెస్ట్రాల్‌ను శరీరంలో నుంచి కరిగించేయడానికి గ్రీన్‌ టీ సమర్థవంతంగా పనిచేస్తుందట. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, కెటాచిన్స్ ఉంటాయి. అంతేకాదు గ్రీన్‌ టీ రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల బరువు కూడా పెరగకుండా ఉంటారు. మానసిక ఆరోగ్యానికి కూడా గ్రీన్‌ టీ సహాయపడుతుంది. చాలామంది ప్రస్తుతం మామలు టీ బదులుగా గ్రీన్‌ టీ లను అలవాటు చేసుకుంటున్నారు.

టమాట జ్యూస్..
టమాట ఈజీగా దొరికే వెజిటేబుల్, ఇది లేనిదే ఏ కూరలు చేసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. టమాట కూడా పోషకాల పానియం. ఇది మనకు ఇమ్యూనిటీ పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.  ఎందుకంటే టమాట జ్యూస్‌లో లైకోపీన్‌ ఉంటుంది. ఇది పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా తగ్గిస్తుంది. అంతేకాదు టమాట జ్యూస్‌లో నియాసిన్, ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తాయి.

ఇదీ చదవండి: వేసవి వేడి నుంచి ఈ 4 మూలికలు మీ పిల్లల్ని కాపాడతాయి.. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి..

సోయా మిల్క్..
సోయా మిల్క్‌ ప్లాంట్‌ బేస్డ్‌ డ్రింక్. ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం. సోయా మిల్క్‌లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాదు సోయా మిల్క్‌ తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. సోయా మిల్క్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా తగ్గించేస్తాయి.

కోకో డ్రింక్స్..
కోకోలో ఫ్లవనాల్స్‌ ఉంటాయి. కోకో డ్రింక్‌ తీసుకుంటే మన శరీరానికి మానసికంగా మాత్రమే కాదు శారీరకంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఫ్లవనాయిల్స్‌ ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తుంది. వీటి లెవల్స్‌ తగ్గితే గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.

ఇదీ చదవండి: ఈ 5 లాభాలు పొందాలంటే.. పాలకూరను తరచూ తినాల్సిందే..!

ఓట్మీల్‌ స్మూథీ..
ఓట్మీల్‌ తో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల బ్లడ్‌ ప్రెజర్‌ తగ్గుతుంది. దీంతో పాటు బరువు కూడా తగ్గిపోతారు. ప్రాణాంతక వ్యాధుల రాకుండా నివారిస్తుంది. ఓట్మీల్‌ గ్లూటెన్ ఫ్రీ ఇందులో ప్రొటీన్, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కరిగే ఫైబర్‌ ఉంటుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News