Eggs For Diabetes: వారానికి నాలుగు కంటే ఎక్కువ గుడ్లు తింటే మధుమేహానికి బైబై చెప్పొచ్చు..
Eggs For Diabetes: గుడ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ గుడ్లను తినాల్సి ఉంటుంది.
Eggs For Diabetes: గుడ్లు తినడం వల్ల చాలా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతూ ఉంటారు. అవును ప్రతి రోజు గుడ్లను ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారికి గుడ్లలను తినడం వల్ల రిస్క్ తగ్గుతుందని ఒక పరిశోధనలో తేలింది. అయితే 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' అధ్యయనాల ప్రకారం.. గుడ్లు తినేవారిలో మధుమేహం సమస్యలు సులభంగా నియంత్రణలో ఉంటుందని పేర్కొన్నారు. అయితే టైప్ 2 మధుమేహం ఉన్నవారు గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
ప్రస్తుతం చాలా మంది అధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి, రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి తప్పకుండా ఆహారంలో గుడ్లను వినియోగించాల్సి ఉంటుంది.
పరిశోధనల ప్రకారం:
యూనివర్శిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్‌లాండ్ పరిశోధకులు 1984 సంవత్సరంలో 42 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 2,332 మంది ఆహారపు అలవాట్లను అధ్యయనం చేశారు. అయితే ఇందులో తేలిన నిజాలేంటంటే.. 432 మంది పురుషులు టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుడ్లు తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని, రక్తంలో గ్లూకోజ్ స్థాయి కూడా తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజూ రోజుకు రెండు గుడ్లను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మధుమేహం దరి చేరదు:
వారానికి నాలుగు కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల మధుమేహం దరి చేరదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో, మధుమేహంతో బాధపడుతున్నవారు వారానికి నాలుగు కంటే ఎక్కువ గుడ్లు తినాల్సి ఉంటుంది.
NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.
Also read: PF Transfer: ఈపీఎఫ్ఓ అప్‌డేట్, పాత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను కొత్త కంపెనీకు ఎలా మార్చడం
Also read: PF Transfer: ఈపీఎఫ్ఓ అప్‌డేట్, పాత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను కొత్త కంపెనీకు ఎలా మార్చడం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook