Exercise Vs Dieting: వ్యాయామం - డైటింగ్.. బరువు తగ్గటానికి ఏది ఉత్తమ మార్గం!
Exercise Vs Dieting: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు పెను సమస్యగా మారింది. స్థూలకాయం తగ్గించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. ఈ క్రమంలో ఏం చేస్తే అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చనేది వివరంగా తెలుసుకుందాం.
Exercise Vs Dieting.. Which one is better to Weight Loss : ఇటీవలి కాలంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఆరోగ్యం వికటిస్తోంది. వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. జీవనశైలి వ్యాధుల్లో అతి ముఖ్యమైంది స్థూలకాయం లేదా అధిక బరువు సమస్య. ఈ ఒక్క సమస్యే పలు సమస్యలకు దారితీస్తోంది.
అధిక బరువు సమస్యతో ఇబ్బందిపడే వాళ్లు డైటింగ్, జిమ్, వర్కవుట్స్, వాకింగ్, రన్నింగ్ ఇలా వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరికి కొన్ని ప్రయత్నాలకు ఫలితాలనిస్తే మరి కొందరికి నిరాశ మిగుల్చుతుంటుంది. దీనికి కారణం ఏయే ఆహార పదార్ధాలతో బరువు పెరుగుతుంది, దేంతో తగ్గించుకోవచ్చనే అవగాహన ఉండదు. స్థూలకాయం సమస్య కారణంగా డయాబెటిస్, అధిక రక్తపోటు, థైరాయిడ్ వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే డైట్ అనేది కీలకపాత్ర పోషిస్తుంది.
హెల్తీ డైట్ తీసుకుంటే చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అసలు వ్యాయామం మంచిదా డైట్ మంచిదా అనే విషయంలో చాలామందికి సందేహాలుంటాయి. వాస్తవానికి బరువు తగ్గించేందుకు వ్యాయామం, డైటింగ్ రెండూ అవసరమే. ఏదో ఒక దాంతో సమస్య పరిష్కారం కాదు. వ్యాయామంతో పాటు డైటింగ్ ఉంటేనే బరువు తగ్గించడం సాధ్యమౌతుంది. ఎక్కువ శాతం డైటింగ్ ప్రభావం చూపిస్తుంది. డైటింగ్ సరిగ్గా ఉంటే చాలావరకూ బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు.
Also Read: Diabetes Diet: ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్‌తో మధుమేహామే కాదు, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకైన చెక్..
బరువు తగ్గించేందుకు రోజుకు 7-8 వేల స్టెప్స్ కచ్చితంగా అవసరం. ఉదయం లేదా సాయంత్రం లేదా రెండు పూట్ల కలిపి పూర్తి చేయవచ్చు. దీనికోసం ప్రతిరోజూ 30-40 నిమిషాలు వాకింగ్ అలవాటుగా చేసుకోవాలి. వ్యాయామం ఏ సమయంలో చేయాలనేది కూడా కీలక భూమిక పోషిస్తుంది. ఉదయం వేళ వాకింగ్ మెరుగైన ఫలితాలనిస్తుందంటారు.
వ్యాయామంతో పాటుగా డైటింగ్ కూడా చాలా అవసరం. తీసుకునే డైట్‌లో ఫైబర్, ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఉదయం, మద్యాహ్నం సాయంత్రం సరైన ఆహారం తీసుకోవాలి. రోజుకు 3 సార్లు క్రమ పద్దతిలో ఆహారం తీసుకోవడం అవసరం. అంటే డైట్ విషయంలో సమయ పాలన ఉండాలి. వీటితో పాటు కొన్ని చిట్కాలు అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలుంటాయి.రోజూ ఉదయం వేళ పరగడుపున జీరా వాటర్, మెంతి నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతమౌతుంది. రోజూ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ బలవర్ధకమైందిగా ఉండాలి. అదే సమయంలో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
Also Read: Pudina Leaves: వేసవిలో పుదీనా ఆకులు రోజూ ఉపయోగిస్తే..ఏయే సమస్యలు దూరమౌతాయో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook