Fiber Rich Foods for Diabetes: ఈ ఫైబర్ ఫుడ్ తో మధుమేహామే కాదు.. చాలా రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!

Fiber Rich Foods: తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతి రోజు కరిగే ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 21, 2023, 01:10 PM IST
Fiber Rich Foods for Diabetes: ఈ ఫైబర్ ఫుడ్ తో మధుమేహామే కాదు.. చాలా రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!

Fiber Rich Foods for Diabetes Diet: మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ఛాన్స్‌ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తులు తగ్గినప్పుడు మధుమేహం తీవ్రతరమవుతుంది. 

మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా శరీరంలో కరిగే ఫైబర్‌ కలిగిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఫైబర్స్ అనేది కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటే గ్లూకోజ్ స్పైక్‌ను కూడా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ పుష్కలంగా ఉండే గుణాలు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులనైన సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. 

శరీరానికి ఫైబర్‌ లభించడానికి ఈ ఆహారాలు తినండి:
Also Read: How To Cure Piles: ఈ యోగాసనాలతో తీవ్ర పైల్స్‌ సమస్యలకు 7 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు!

ఓట్స్‌:
ఓట్స్‌లో కరిగే ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి అల్పాహారంలో వీటితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రిస్తుంది. తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

గోధుమ: 
గోధుమల్లో 6 గ్రాముల ఫైబర్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో కరిగే ఫైబర్‌ కూడా లభిస్తుంది. గోధుమలతో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజు తింటే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా నియంత్రణలో ఉంటాయి. 

Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News