Jal Jeera Powder Recipe: జీర్ణవ్యవస్థతో బాధపడుతున్నవారు జల్‌ జీరా పౌడర్‌ ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీని వల్ల ఎలాంటి సమస్యలు బారిన పడాల్సి అవసరం లేదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీనిని వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ‌ల్ జీరా పౌడ‌ర్ కి కావాల్సిన ప‌దార్థాలు:


జీల‌క‌ర్ర, శొంఠి, మిరియాలు , ఆమ్ చూర్ పౌడ‌ర్ , చాట్ మ‌సాలా పొడి , బ్లాక్ సాల్ట్, ఉప్పు , ఇంగువ, పంచ‌దార పొడి, నిమ్మ‌కాయ ముక్క, అల్లం ముక్క, పుదీనా ఆకులు, జ‌ల్ జీరా పొడి, పంచ‌దార పొడి, నిమ్మ‌ర‌సం, సోడా 



జ‌ల్ జీరా పౌడ‌ర్ తయారీ విధానం:


ముందుగా ఒక క‌ళాయిలో జీల‌క‌ర్ర‌, శొంఠి ముక్క‌లు, మిరియాలు వేసి వేయించాలి.  మూడు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.  వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి.  ఇందులో మిగిలిన ప‌దార్థాల‌న్నింటిని వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. 


మరో చిట్కా:


రోట్లో నిమ్మ‌కాయ ముక్క‌, అల్లం ముక్క‌, పుదీనా ఆకులు వేసి క‌చ్చాప‌చ్చాగా దంచుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.  ఈ గ్లాస్ లో జ‌ల్ జీరా పొడి, పంచ‌దార పొడి, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత సోడాను పోసి క‌ల‌పాలి. ఇలా చేక‌య‌డం వ‌ల్ల డ్రింక్ త‌యార‌వుతుంది. 



ఇలా జ‌ల్ జీరా పొడితో డ్రింక్ ను త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం శుభ్ర‌ప‌డుతుంది. జ‌ల్ జీరా పౌడ‌ర్ త‌యార‌వుతుంది.దీనిని ఒక గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచడం వ‌ల్ల ఆరు నెల‌ల పాటు తాజాగా ఉంటుంది.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter