Kapham In Lungs: శీతాకాలంలో చలిగాలులు ఎక్కువగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల్లో బాగా క‌ఫం పేరుకుపోతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వ‌ల్ల జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ‌, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు బారిన పడుతాము. ఈ కఫం కారణంగా చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కఫం నుంచి ఉపశమనం పొందాలి అనుకునేవారు ఇంట్లో ఉండే ప‌దార్థాలతోనే వీటి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఛాతిలో ఉండే క‌ఫం బ‌య‌ట‌కు పోతుంది. దీని కోసం మీరు ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించాలి. 


[[{"fid":"289869","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


వంటల్లో ఎక్కువగా లవంగాలు, అల్లం వాడుతూ ఉంటారు. ఇవి వంటలకు మాత్రమే కాకుండా చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, కఫం బయటకు పంపేందుకు ఎంతో సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోవాలి, దీంతో పాటు నాలుగు లవంగాలను  తీసుకోవాలి. రెండిటిని కలిపి బాగా దంచాలి. దీనిని ఒక గ్లాస్‌ పాలలో కలిపి మరిగించాలి.  తర్వత ఈ మిశ్రమాన్ని తేనె లేద చక్కెరతో తాగాలి. ఇలా చేయడం వల్ల కఫం వేంటనే బయటకు వస్తుంది.


Also read: Amla Side Effects: ఉసిరితో దుష్పరిణామాలు కూడా ఉంటాయా, ఎవరెవరు తినకూడదు


చిట్కాతో వచ్చే లాభాలు: 


 ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల  ఛాతిలోని కఫం బయటకు వస్తుంది. కఫం బయటకి రావడం వల్ల ముక్క రంధ్రాలు శ్వాస తీసుకోవడం సులభంగా ఉంటుంది. 


అంతేకాకుండా గొంతు నొప్పి, మంట ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.


కఫం బయటకు పంపడంలో అల్లం ముక్కలు ఎంతో సహాయపడుతాయి.


ల‌వంగాల్లో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.


ల‌వంగా వల్ల ద‌గ్గు, జ‌లుబు నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.


Also read: Barley Water: ప్రతిరోజు బార్లీ నీరు తాగితే కలిగే లాభాలు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి