Fennel Water For Weight Loss: సోంపులో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి భారతీయులు ఆహారాలు తీసుకున్న తర్వాత చివరిలో సోంపును తీసుకుంటారు. ఇలా తీసుకోవడం పూర్వకాలం నుంచి వస్తోంది. ఇలా తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అయితే సోంపుతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు తీవ్ర పొట్ట సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, మినరల్స్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల శరీర బరువు కూడా సులభంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది. ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలో, దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా సోంపు వాటర్‌ తాగండి:
వేసవి రోజున ఖాళీ కడుపుతో సోపు నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా తాగడం వల్ల శరీరం రోజంతా హైడ్రేట్ ఉంటుంది. అంతేకాకుండా హిట్‌ వేవ్‌ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఈ నీటిని తీసుకోవచ్చు. 


ఇది కూడా చదవండి : Leopard Attack Viral Videos: అడుగులో అడుగేసుకుంటూ సైలెంటుగా వచ్చిన చిరుత.. అక్కడే నిద్రిస్తున్న వ్యక్తి..


సోంపు వాటర్‌ తయారీ పద్ధతి:
సోంపు వాటర్‌ తయారు చేయడానికి ముందుగా రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో సోంపు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రాత్రంత ఉంచిన నీటిని ఉదయాన్నే ఫిల్టర్‌ చేసి సోంపును నమిలి తినండి. వడబోసుకున్న నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా శరీర బరువు తగ్గుతారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.


సోంపు వాటర్‌ దుష్ప్రభావాలు:
❁ సోంపు వాటర్‌ అతిగా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
❁ ముఖ్యంగా ఈ నీటిని అతిగా తాగడం వల్ల స్ట్రోజెన్ హార్మోన్ సమస్యలు కూడా రావొచ్చు.
❁ గర్భిణీలు అతిగా ఈ నీటిని తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
❁ కొంత మందిలో  అలెర్జీ సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. 
❁ టిబి సమస్యలున్నవారు అస్సులు ఈ నీటిని తాగొద్దు.


ఇది కూడా చదవండి : Leopard Attack Viral Videos: అడుగులో అడుగేసుకుంటూ సైలెంటుగా వచ్చిన చిరుత.. అక్కడే నిద్రిస్తున్న వ్యక్తి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK